OTT Movies: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీలో సందడీ చేస్తుంటాయి. ఈ సారి కూడా సినీ లవర్స్ ను అలరించడానికి కొత్త చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అవేంటో ఇక్కడ చూద్దాం
మజాకా
హీరో సందీప్ కిషన్, రావు రమేష్ కీలక పాత్రలో నటించిన చిత్రం మజాకా (Mazaka ) . ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ కలెక్ట్ చేయలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రానికి త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. రీతూ వర్మ, అన్షు హీరోయిన్స్ గా నటించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌పై అనిల్ సుంకర , రామబ్రహ్మం సుంకర, రాజేష్ దండా , ఉమేష్ కెఆర్ బన్సల్ నిర్మించారు. రావు రమేష్ కి చెందిన సీన్స్ సినిమాలో ఓవర్ ఐనట్టు అనిపించాయి. ఫిబ్రవరి 26 న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది.
దేవ
షాహిద్ కపూర్ హీరోగా ” దేవ ” ( Deva) మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా జనవరి 31న రిలీజ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. మలయాళంలో 2013లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ ముంబై పోలీస్ రీమేక్ గా నిర్మించిన ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ చేయగా.. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించాడు. ఈ మూవీలో పూజా హెగ్డే, పావైల్ గులాటి, ప్రవేశ్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. ఎలాంటి ప్రకటన లేకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.
Also Read: Nara Lokesh: లోకేష్ కు ఒక్క మెసేజ్.. అందరూ అలర్ట్.. అంతా 15 నిమిషాల్లోనే..
శబ్దం
ఆది పినిశెట్టి సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన వైశాలి మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మూవీకి దర్శకత్వం వహించిన అరివళగన్ ” శబ్దం ” ( Sabdam ) అనే కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. తమన్ ఇచ్చిన మ్యూజిక్ , ఆర్ఆర్ ప్లస్ అయ్యాయనే చెప్పుకోవాలి. ఈ ముగ్గురి కాంబో ఇన్నేళ్ళకు రిపీట్ అయింది. వైశాలి చిత్రంలో నీరు హైలెట్ అయితే, ఇక్కడ సౌండ్ ను బేస్ చేసుకుని కథను అద్భుతంగ రాశాడు. థియేటర్లలో యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్.. ప్రస్తుతం, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆది పినిశెట్టి, సిమ్రన్, లైలా, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
అగత్యా
యాక్షన్ కింగ్ అర్జున్, హీరో జీవా కలిసి నటించిన మూవీ అగత్యా (Aghathiyaa ) . ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. యోగి బాబు ముఖ్య పాత్రలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా పని చేశారు. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫిగా వర్క్ చేయగా సాన్ లోకేష్ ఎడిటర్ గా చేశారు. ఇషారి కే. గణేష్ , అనీష్ అర్జున్ దేవ్ నిర్మాతలుగా వ్యవహరించారు. విజయ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 28 న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం, సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది.