Tirupati Crime (IMAGE CREDIT:CANVA)
తిరుపతి

Tirupati Crime: భలే ఫ్రెండ్.. కాసుల కోసం కిడ్నాప్ చేశాడు.. ఆ తర్వాత?

Tirupati Crime: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటుంటారు. కానీ ఇక్కడ ఓ స్నేహితుడు స్నేహం ముసుగులో పెద్ద పన్నాగమే పన్నాడు. ఏకంగా తన స్నేహితుని కుటుంబాన్ని కిడ్నాప్ చేసి మరీ, డబ్బులకు కక్కుర్తిపడ్డాడు. ఇంకేముంది ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. సినిమా రేంజ్ సీన్లను తలపించిన ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సుఖాంతం చేయడంతో, ఏపీ పోలీసులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..

తిరుపతికి చెందిన కాసరం రాజేష్ తో పాటు అతని కుటుంబసభ్యులను గుర్తు తెలియని వ్యక్తులు మార్చి 28, 29 తేదీలలో కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ సమయంలో రాజేష్ తప్పించుకొని, తన ఫ్యామిలీ కిడ్నాప్ గురించి అలిపిరి పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం అందించాడు. ఇక అంతే పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల భరతం పట్టేందుకు పెద్ద ప్లాన్ వేశారు. ఎట్టకేలకు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు.

కిడ్నాప్ కు కారణం ఇదే..
రాజేష్ కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు పెద్ద కారణమే ఉందని పోలీసులు ధ్రువీకరించారు. రాజేష్ తల్లికి రూ. 1.5 కోట్ల డబ్బులు వస్తున్నాయని కిడ్నాపర్స్ కు తెలిసింది. ఆ కారణంగానే డబ్బులు డిమాండ్ చేసేందుకు మొత్తం ఫ్యామిలీని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే కిడ్నాప్ కు పాల్పడింది ఎవరో తెలిసి రాజేష్ తో పాటు అతని ఫ్యామిలీ కూడా షాక్ కు గురైంది.

స్నేహితుడే కిడ్నాపర్..
రాజేష్ కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించింది ఎవరో కాదు తోటి స్నేహితుడు భార్గవ్ అని పోలీసులు తేల్చారు. రాజేష్ తల్లికి భీమా డబ్బులు వస్తున్నాయన్న సమాచారం తెలుసుకున్న భార్గవ్, అరుణ్ కుమార్ తో కలసి కిడ్నాప్ కు పక్కా ప్లాన్ వేశాడు. అనుమానం రాకుండా ఇవ్వవలసిన 24 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మబలికిన భార్గవ్, కుటుంబాన్ని పిలిపించి కిడ్నాప్ కు పాల్పడ్డాడు.

కిడ్నాప్ వ్యవహారాన్ని పసిగట్టిన రాజేష్.. పల్లె వద్ద తప్పించుకొని 100కు కాల్ చేశాడు. అప్రమత్తమైన కిడ్నాపర్లు చిత్తూరు వద్ద రాజేష్ తల్లిని వదిలిపెట్టి, కుటుంబాన్ని మరొక చోట వదిలేసి పారిపోయారు. బాధితుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అలిపిరి పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాపర్లను రేణిగుంట – కడప మార్గంలోని కుక్కల దొడ్డివద్ద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కిడ్నాపర్లు వీరే..
జీవకోనక చెందిన సంగీతం భార్గవ్, తిమ్మినాయుడుపాలెం పంచాయతీ కి చెందిన వట్టి కుంట అరున్ కుమార్, శ్రీకాళహస్తి మండలం,జోగరాజుపల్లి గ్రమాంకు చెందిన దామతోటి సాయి కుమార్, రేణిగుంట మండలం , తిమ్మయ్య గుంట గ్రామం కు చెందిన బలిపాకు మణికంఠ, ఏర్పేడు మండలం, ఇసుకతగేలి హరిజనవాడ కు చెందిన చీరాల ప్రకాష్, పెళ్లకూరు మండలం,చిల్లకూరు హారిజనవాడ కు చెందిన సిరియల గణేష్ లు కిడ్నాప్ కు పాల్పడినట్లు గుర్తించి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద రెండు కార్లు, 7 సెల్ ఫోన్లు,4 కత్తులు, ప్లాస్టిక్ రోప్, వాటర్ ప్రూఫ్ టేప్ లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Viral News: ఈ కారు వెరీ స్పెషల్.. కాదు కాదు.. ఈ మంచం వెరీ స్పెషల్..

అలాగే కిడ్నాపర్ల వద్ద మత్తును కలిగించే ఇంజక్షన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరుణ్ కుమార్ పై ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు, వారణాసి ఎటిఎం కేసు, రామకుప్పం, సంబేపల్లి లో కిడ్నాప్ కేసులు వున్నాయని డిఎస్పి శ్రీలత వెల్లడించారు. భార్గవ్ పై ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు, రామకుప్పం కిడ్నాప్ కేసు వుందని, సాయికుమార్ పై దొంగతనం కొట్లాట కేసులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని డిఎస్పీ తెలిపారు. మొత్తం మీద స్నేహం అనే బంధానికి మచ్చ తెచ్చేలా స్నేహితుడే కిడ్నాప్ కు పాల్పడడం తిరుపతిలో సంచలనంగా మారింది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం