Viral News: భైరవద్వీపం సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో విలన్ మంచాన్ని గాల్లోకి తీసుకెళ్ళి, హీరోయిన్ రోజాను ను బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో హీరో బాలకృష్ణ, ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. అలా గాల్లోకి లేచే మంచం సీన్ చూసి ప్రేరణ పొందాడో ఏమో కానీ, ఓ వ్యక్తి మంచంతో పెద్ద ప్రయత్నమే చేశాడు. అతను మంచం బయటకు తెస్తే చాలు, అందరూ అతని చుట్టూ ఉంటున్నారు. ఇంతకు ఇంతలా అందరినీ ఆకట్టుకుంటున్న ఆ మంచం కథ ఏమిటో తెలుసుకుందాం.
మంచం.. ఈ మాట వింటేనే మనకు నిద్ర రావాల్సిందే. మంచం లేనిదే కొందరికి నిద్రే రాదు. అయితే మనోడికి మంచం అంటే ఎంత ప్రేమ ఉందో కానీ, మంచాన్ని మంచంలా కాకుండా మరోలా ట్రై చేశాడు. అందరినీ ఆశ్చర్యకితులను చేశాడు. అందరి చూపు ఆ మంచం వైపే ఉండడంతో, మంచాన్ని తెగ భద్రంగా ఉంచుకుంటున్నాడు.
పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ లోని శంభునగర్ కు చెందిన నవాబ్ కు మంచం అంటే ప్రాణం. అయితే మంచంతో పలు ప్రయోగాలు చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తనకు మంచంతో ఓ వాహనం తయారు చేయాలని అనుకున్నాడు. ఎంచక్కా కారును మంచంలా మార్చేశాడు. ఆ మంచంపై కూర్చొని రోడ్డుపై చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఇక అంతే చూసిన వారందరూ ఇదెక్కడి మంచం.. రయ్.. రయ్ అంటూ వెళుతోందంటూ.. ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతేకాదు ఆ మంచం కాదు కాదు మంచాన్ని పోలిన కారుకు తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
కారుకు మంచాన్ని పోలిన విధంగా డిజైన్ చేసి, స్టీరింగ్ తిప్పుతూ నవాబ్ తమ గ్రామంలో షికార్లు చేస్తున్నాడు. కొందరు యువకులు మంచాన్ని పోలిన కారును వీడియో తీయగా, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరెరె.. నవాబ్ ఒకే ఒక్క సెల్ఫీ అంటూ మంచం చుట్టూ అందరూ తిరుగుతున్నారట.
Also Read: Ancient vs Modern Marriage: పెళ్లి నిశ్చయం కావాలంటే.. ఇంట్లోకి తొంగి చూడాల్సిందే.. అసలెందుకంటే?
మొత్తం మీద మనోడికి మంచం మీద ఉన్న ప్రేమ, కారులా మార్చే స్థాయికి తీసుకెళ్లింది. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడని నవాబ్ నిరూపించాడని, నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా నవాబ్ షికారు చేసే మంచం కారును చూడాలంటే కింద గల వీడియోలో చూసేయండి!
మంచాన్ని కారులా మార్చి రోడ్డుపై చక్కర్లు కొడుతున్న వ్యక్తి
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ వింత వాహనం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. శంభునగర్కు చెందిన నవాబ్ అనే వ్యక్తి ఓ మంచాన్ని.. కారులా మార్చి రోడ్డుపై చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో… pic.twitter.com/r1uUoTZwQV
— ChotaNews App (@ChotaNewsApp) April 5, 2025