Tirumala Update: దేశంలోని ప్రముఖ సుప్రసిద్ధ దేవాలయాల్లో తిరుమల ఒకటి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రపంచ నలుమూల నుంచి వచ్చి స్వామి వారి మెుక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో భక్తుల కోసం టీటీడీ ప్రతి నెలా ఆన్ లైన్ లో ఆర్జిత సేవ, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల విడుదల వివరాలను టీటీడీ ప్రకటించింది.
19న నుంచి టికెట్లు..
ఆగష్టు-2025 కి సంబంధించిన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్లు 19.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు 19.05.2025 ఉదయం 10:00 గంటల నుండి 21.05.2025 ఉదయం 10:00 గంటల వరకు తెరిచి ఉంటాయి.
కళ్యాణం, ఊంజల్ సేవ టికెట్లు
ఆగస్టు-2025కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను ఈ నెల 22న టీటీడీ విడుదల చేయనుంది. ఉ.10:00 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అలాగే ఆగస్టుకి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు ఆన్‌లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) టికెట్లను కూడా 22న టీటీడీ విడుదల చేయనుంది. దర్శన కోటా బుకింగ్స్ ఆ రోజు మ.3 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
శ్రీవాణి ట్రస్ట్ టోకెన్లు
ఆగస్టు నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్స్ ఈ నెల 23న ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ కు దర్శనం & వసతి కోటా (రూ. 10,000/-) దాతలకు 23 ఉదయం 11:00 గంటల నుండి టికెట్లు ఇవ్వనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి సీనియర్ సిటిజన్లు / శారీరకంగా వికలాంగుల కోటా బుకింగ్ కోసం 23న మధ్యాహ్నం 3:00 గంటల నుండి టికెట్లు విడుదల చేయనున్నారు.
రూ.300 స్పెషల్ దర్శనం
తిరుమల భక్తులు ఎక్కువగా ఎదురు చూసే స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ.300) టిక్కెట్లు బుకింగ్స్ ను ఈ నెల 24న టీటీడీ ఓపెన్ చేయనుంది. ఉదయం 10:00 గంటల నుండి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మరోవైపు తిరుమల వసతి కోటా బుకింగ్స్ 24న మధ్యాహ్నం 3గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
Also Read: Gold Rate Today : మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..
జూన్ నెలకు సంబంధించి..
జూన్ నెలకు సంబంధించి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (తిరుచానూరు) ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) టిక్కెట్లు బుకింగ్స్ ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. అలాగే జూన్ నెలకి టీటీడీ స్థానిక దేవాలయాల సేవా కోటా బుకింగ్స్ కోసం 26న ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లు 26న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో లభించనున్నాయి.