CM Revanth Reddy: బీఆర్ ఎస్ లో కీలక పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులకేనా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ..పార్టీలోని బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇవ్వాలని సూచించారు. దళితుడిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలన్నారు. గతంలో దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసే అవకాశం ఉన్నదన్నారు.
కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు పనిచేస్తానని చెప్పడంలో అర్ధం లేదన్నారు. వాళ్ల కుటుంబంలో ఎవరికి నాయకత్వం అయినా ఒకటే తరహాలో ఉంటుందన్నారు. ఆ స్థానంలో బిల్లా అయితే ఎంటి? రంగా అయితే ఎంటి? అని విమర్శించారు. కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ ఇంకా ఎవరి నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు గొప్పగా చెప్పుకోవాలని, కానీ మళ్లీ కేటీఆర్ పేరు చెప్పడం హాస్యస్పదంగా ఉన్నదన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను తాము గాంధీ కుటుంబంతో సమానంగా గౌరవిస్తున్నామని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో భవిష్యత్ దేశమంతా కాంగ్రెస్ రాబోతున్నదన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు