Tirumala News: ఇటీవలే వింత వింత ఘటనలన్నీ చూస్తున్నాము. ఎందుకంటే, రెప్ప పాటు క్షణంలోనే అన్ని జరిగిపోతున్నాయి. తాజగా, తిరుమలలో ( Tirumala ) జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారులను తిరుమల ట్రాఫిక్ పోలీసులు ప్రాణాలతో కాపాడారు. అసలేం జరిగిందో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
ఓ ఫ్యామిలీ దేవుడ్ని దర్శించుకుందామని గుడికి వెళ్ళారు. అయితే, పిల్లల పెద్దనాన్న, ఇద్దరు పిల్లలు, అల్లుడు కలిసి తిరుమలకు ఓకే కారులో ప్రయాణించారు. గమ్యస్థానాన్ని చేరుకొని స్థానిక వరాహస్వామి అతిథిగృహం-1 పార్కింగ్ కారును ఏరియాలో పార్క్ చేశారు.
దర్శనానికి ఎంత సమయం పడుతుందనే వివరాలు తెలుసుకునేందుకు గంగయ్య పిల్లలను కారులోనే అతను, అల్లుడు గుడి వద్దకు వెళ్ళారు. వెళ్లేముందు పిల్లలు ఉన్నారని మర్చిపోయినట్టు ఉన్నారు. డోర్లు లాక్ చేసుకుని వెళ్లడంతో కారులో ఉన్న పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Also Read: Naa Anveshana On Aghori: అఘోరీని చీల్చి చెండాడిన నా అన్వేష్.. ఇది మామూలు రోస్టింగ్ కాదు భయ్యా!
కారులో ఇబ్బంది పడుతున్న ఇద్దరు చిన్నారులను టాక్సీ డ్రైవర్లు గుర్తించి వెంటనే తిరుమల ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు ఆ పార్కింగ్ ప్లేస్ కు చేరుకొని కారు అద్దాలను పగలకొట్టి చిన్నారులను సురరక్షితంగా కాపాడారు. పిల్లల అపస్మారక స్థితిలో ఉండటంతో పక్కనే ఉన్న తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. నడకమార్గంలో చిన్నారుల తల్లిదండ్రులు రావడంతో ఈ విషయం వారికీ తెలియలేదు. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా కారులో వదిలివెళ్లిన పెద్దనాన్న గంగయ్య పై తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పిల్లలతో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- బస్సులో ప్రయాణించేటప్పుడు పిల్లలను తమతో పాటే ఉంచుకోండి. ఎక్కడికెళ్ళినా వారిని కూడా చేయి పట్టుకుని మీతోనే తీసుకెళ్ళండి.
- తెలియని ప్రదేశానికి పిల్లలను తీసుకెళ్లేటప్పుడు ఇంటి వద్ద నుంచే వారికీ జాగ్రత్తలు చెబుతూ మోటివేట్ చేస్తూ మీతోనే ఉంచుకోవాలి.
- కారులో ప్రయాణించేటప్పుడు ఏదైనా ప్రదేశంలో మధ్యలో ఆపినప్పుడు పిల్లలను కారులో పెట్టి డోర్లు లాక్ చేయకండి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు