Sindoor: సాధారణంగా ఆడవాళ్ళు బొట్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక కొందరైతే, నుదిటి పై బొట్టు లేకుండా బయటకు కూడా వెళ్ళరు. పెళ్లైన మహిళలు పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా పాపిట్లో సిందూరం ( Sindoor) పెట్టుకుంటారు. అయితే, ఇలా ఎందుకు పెట్టుకుంటారో ఎవరికీ తెలియదు. పాపిట్లో సిందూరం ధరిస్తే భర్తకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. అసలు దీని వెనుకున్న పురాణ కథ ఏంటి ? దీనిలో ఎంత వరకు నిజముందో ఇక్కడ తెలుసుకుందాం..
దీని వెనుక పురాణ కథ ఇదే..
సిందూరం చేత పూజలు అందుకునేది వాళ్లే. సిందూర స్పర్శ లేకుండా గణపతి విగ్రహం ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి, మనం పూజ చేసేటప్పుడు వినాయకుడికి సిందూరం పెట్టకుండా అసలు చేయకూడదు. అసలు, దీని వెనుక అసలు రహస్యం ఏంటో ఇక్కడ చూద్దాం..
సీతమ్మ తల్లీ పాపిట్లో ఎప్పుడూ బొట్టు పెట్టుకునేదని పురాణాలు చెబుతున్నాయి. ఆమె నుదుటి పైన బొట్టు పెట్టుకుని, పాపిట్లో సిందూరం పెట్టుకునేది. ఒక రోజు హనుమ, సీతమ్మని ఇలా అడిగాడు, ” అమ్మా మీరెప్పుడు పాపిట్లో ఎందుకు బొట్టు పెట్టుకుంటారు ” అని అడిగాడు. అప్పుడు సీతమ్మ వారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి నేను ఇక్కడ పెట్టుకుంటే మీ రాముడికి కలిసి వస్తుందని చెప్పింది. అది విన్న హనుమ ” అమ్మా మీరు పాపిట్లో బొట్టుకుంటేనే స్వామికి కలిసి వస్తే, నేను ఒళ్ళంతా రాసుకుంటానమ్మా ” అని అన్నాడు.
Also Read: Bhu Bharati Act: మీ భూమి సమస్యకు ఇక పరిష్కారం.. భూభారతిలోనే.. కొత్తగూడెం కలెక్టర్!
అందుకే ఆ పాపిటకు అంత ప్రత్యేకత ఉంది. పాపిట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఖచ్చితంగా ఉండాలి. మన నుదుటి మీద పెట్టుకునే బొట్టు బాగా చెమట పట్టినప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ పోయే అవకాశం ఉంది. అలాగే, తెలియక పిల్లల చేయి తగిలినప్పుడు కూడా ఈ బొట్టు పోతుంది. కానీ, పాపిట మొదట్లో పెట్టుకున్న సిందూరం మాత్రం అలాగే ఉండి పోతోంది. స్నానం చేసిన బొట్టు మచ్చ మాత్రం ముద్ర లాగే ఉంటుంది. ఎందుకంటే, అది లక్ష్మి దేవి స్థానం. అలాగే, భర్తకు ఐశ్వర్య కారకంగా చెబుతుంటారు.