CM Chandrababu: తిరుమల పవిత్రతను కాపాడడంలో ఏ మాత్రం వెనుకాడబోమని సీఎం చంద్రబాబు అన్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలసి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి, సేవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబం టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.44లక్షలు విరాళంగా అందజేసారు.
అనంతరం మీడియాతో సీఎం మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడేలా ప్రక్షాళన చేపట్టామని, వ్యక్తి గత ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదన్నారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకి అన్నప్రసాదానికి విరాళం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రామారావు ప్రవేశపెట్టిన అన్నదాన ట్రస్ట్ కు ఇప్పటివరకు 2200కు విరాళాలు వచ్చాయన్నారు.
గతంలో ఏడూ కొండలని ఐదు కొండలన్నారని పరోక్షంగా వైసీపీ లక్ష్యంగా విమర్శించారు. అలిపిరి వద్ద తనపై 23 ప్లేమోర్ మైన్స్ తో జరిగిన ప్రమాదం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారే తనను కాపాడారన్నారు. వెంకటేశ్వర స్వామి వద్ద అందరూ జాగ్రత్తగా వుండాలని, వచ్చే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తాను ఎన్నికలలో గెలిచిన వెంటనే, ప్రక్షాళన ఇక్కడనుంచి మొదలు పెట్టిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.
ఏడుకొండలు ఆనుకోని ముంతాజ్ హోటల్స్ కి అనుమతులు ఇచ్చారని, ముంతాజ్ హోటల్స్ కు అనుమతులు రద్దు చేస్తున్నామని తెలిపారు. వ్యక్తి గత ప్రయోజనల కోసం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. విదేశాల్లో వుండే హిందువులకు ఇక్కడికి రావాలనే కోరిక ఉంటుందని, హిందువులు ఎక్కువ ఉన్న ప్రపంచ దేశాల్లో స్వామి వారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
Also Read: Rains In Telugu States: సమయం లేదు.. మరికొద్ది గంటల్లో జోరు వర్షాలే..
వెంకటేశ్వర ఆలయ నిర్మాన నిధి ట్రస్ట్ స్థాపిస్తున్నామని, ఈ ట్రస్ట్ ద్వారానే ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు దోచుకున్నా వదిలిపెట్టమని, టీటీడీ మేనేజ్మెంట్ ద్వారా విరాళాలు సేకరించి ఆలయాలు నిర్మిస్తామన్నారు. తిరుపతికి నీటి సమస్య రాకుండా చూస్తున్నామని, గతంలో నీటి సమస్య వున్నప్పుడు 600 ట్యాంకర్ల ద్వారా తిరుమలకు నీరు అందించామన్నారు. టీటీడీ ఉద్యోగులు కూడా భక్తులకు సేవా భావంతో, భక్తి భావంతో సేవ చేయాలన్నారు. ఏపీలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ది చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.