Vijay Kumar: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు విజయ కుమార్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కూతురు, నటి శ్రీ దేవి, ఇతర కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలు సత్కరించారు.
Also read: Tirumala Kalyanakatta: తిరుమలలో ఇంత అన్యాయమా? ఈ వీడియో వెనుక అసలు కథ ఏంటి?
ఆలయం వెలుపల విజయ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… దేవుని పిలుపు లేనిదే తిరుమలకు రాలేమని అన్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి శ్రీ స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. చాలా మంచి దర్శన భాగ్యం కలిగిందని చెప్పారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. అనంతరం శ్రీ దేవి మీడియాతో మాట్లాడుతూ…. చాలా రోజుల అనంతరం స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే అనేక సినిమాలు రానున్నాయని తెలియజేశారు. సుందరకాండ సినిమా విడుదల కానుందని… సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.