Harish Rao (imagecredit:twitter)
తెలంగాణ

Harish Rao: కాంగ్రెస్ నాయకుల అసలు రూపం బయటపడింది.. హరీష్ రావు!

Harish Rao: నీరు జీవనాధారం, దేశాల మధ్య నీళ్ల కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనకు తెలుసు తెలంగాణ ఉద్యమం కూడా నీళ్ల నుంచే పుట్టింది. అంతటి ప్రాధాన్యం ఉన్న నీళ్లను కాంగ్రెస్ విస్మరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. నాడు సమైక్య ఏపీలో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిదని అన్నారు. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల రూపంలో నష్టం వాటిల్లుతున్నదని అన్నారు. ఉమ్మడి పాలనలో సాగిన జలదోపిడి, నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైంది. నాడు పదవుల కోసం పెదవులు మూసారు, నేడు అదే పరిస్థిదంని అన్నారు. గురు దక్షిణ చెల్లించుకుంటున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. ఏపీ బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయే కుట్ర జరుగుతున్నదని అన్నారు. ఇది తెలంగాణకు తీవ్రమైన నష్టం చేయబోతున్నది. మిగులు జలాలు అంటూ మాట్లాడుతున్నారు. నాడు తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని చంద్రబాబు లేఖలు ఎందుకు రాశారని అన్నారు. ఇదే చంద్రబాబు ఆనాడు కాళేశ్వరం అడ్డుకునేందుకు అనేక లేఖలు రాసారు. 2018లో కేంద్ర జలవనరుల శాఖకు ఉత్తరం రాసిండు.

Also Read: Hyderabad EV Buses: హైద‌రాబాద్‌కు మ‌రో 800 ఈవీ బ‌స్సులు కేటాయించండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి!

అపెక్స్ కౌన్సిల్, సిడబ్లుసి అనుమతి లేకుండా, విభజన చట్టం ఉల్లంఘిస్తూ కాళేశ్వరం కడుతున్నరని అడ్డుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నడు. కాళేశ్వరం కొత్తది కాదు, ప్రాణహితకు కొనసాగింపు అని వాస్తవం చెప్పి కేంద్రం నుంచి అనుమతి సాధించామని గుర్తుచేశారు. భక్త రామదాసు లిఫ్టు ఆపేందుకు లేఖ రాసిండు. పాలమూరు సహా 20, 30 ప్రాజెక్టులు అడ్డుకోవాలని లేఖలు రాసిండు చంద్రబాబు, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసిండు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? విభజన చట్టం ప్రకారం, కేఆర్ఎంబీ లేదా జీఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి. ఆయా పరివాహక రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ ఒక్క అనుమతి లేకుండా, నిబంధనలు బుల్డోజ్ చేస్తూ, కేంద్రం జుట్టు చేతిలో ఉందని రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మా పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటే అడ్డుకున్నరు, మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని, గత అసెంబ్లీలో చెప్పిండు, నీతి అయోగ్ బహిష్కరిస్తం అని. నిన్న మాత్రం అందరి కంటే ముందే పోయి నీతి అయోగ్ మీటింగ్ కు పోయిండు. బనకచర్ల అడ్డుకుంటడు, నీతి అయోగ్ లో మాట్లాడుతడు అనుకున్నాము. కానీ మంత్రి మాట్లాడడు, ముఖ్యమంత్రి మాట్లాడడని హరీష్ రావు అన్నారు.

Also Read: Miss world Contestants: తెలంగాణ గురించి మిస్ వరల్డ్ భామలు ఏమన్నారో తెలుసా?

మిగులు జలాల వాడుకుంటున్నం అని చంద్రబాబు చెబుతున్నాడు. గోదావరి మిగులు జలాలు కావు అవి, తెలంగాణ వినియోగించుకోకపోవడం వల్ల కిందకు వెళ్తున్న నీళ్లు అవి అని హరీష్ రావు అన్నారు. అసలు కుట్ర ఏమిటంటే, గోదావరి మీద ట్రిబ్యునల్ వేయాలని ఏపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే బనకచర్ల నిర్మించి, ప్రజాధనం ఖర్చు అయ్యింది కాబట్టి, నీళ్లు కేటాయించాలని చెప్పి, 200 టీఎంసీలు తీసుకునే కుట్ర ఇది. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. 8 ఎంపీలు కాంగ్రెస్, 8 ఎంపీలు బిజేపీ నుంచి గెలిచి రాష్ట్రానికి ఏం లాభం. బడ్జెట్లో ఏం ఇవ్వరు, మన నీళ్లు తరలిస్తురు. ఏ పార్టీ వారు మాట్లాడరు. కేంద్రంలో ఉన్న వారు మాట్లాడరు, ఇక్కడ ఉన్న వారు మాట్లాడరు. చట్టపరమైన చర్యలు తీసుకోరు, ప్రజా పోరాటం మొదలు పెట్టరు. మొద్దు నిద్ర పోతుండటం సిగ్గుచేటని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉంది ఏం చేస్తున్నారు. ప్రధాని దగ్గరకు పోయి చెప్పరా, కేబినెట్ లో మాట్లాడరా అని అన్నారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు 50శాతం కేంద్రం గ్రాంటు ఇస్తదట, మరో 50శాతం ఎఫ్ ఆర్ బి ఎం మించి రుణం తీసుకునే వెసులు బాటు కల్పిస్తారట. నిబంధనలు యదేచ్చగా ఉల్లంఘిస్తుంటే ఎందుకు అనుమతులు ఇస్తున్నారు, రుణం ఎలా ఇస్తున్నారు. కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మీకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కావా అని హరీష్ రావు అన్నారు.

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు