Hyderabad EV Buses: హైదరాబాద్‌కు మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు (ఈవీ) కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు 2000 ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద అదనంగా 800 బస్సులు కేటాయించాలని కోరారు.
Also Raed: Minister Konda Surekha: గిరిజనులను ఇబ్బంది పెట్టొద్దు.. అటవీ అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం!
ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రికి సీఎం సూచించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు రెట్రోఫిట్టెడ్ చేపట్టగా అది సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్‌మెంట్ అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు లు పాల్గొన్నారు.
Also Raed: Congress on KTR: కేటీఆర్ కు పైసల బలుపు.. సీఎం ను విమర్శిస్తే ఊరుకోం ఎమ్మెల్యే కామెంట్స్!