Congress on KTR: కేటీఆర్ కు పైసల బలుపు ఉన్నదని ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, మధు సూదన్ రెడ్డిలు విమర్శించారు. అక్రమ సొమ్ముతో అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నాడన్నారు. సీఎంను విమర్శిస్తే ఊరుకోమన్నారు. శనివారం హైదరాబాద్ సీఎల్పీ ఆఫీస్ లో వీరు మాట్లాడుతూ…కేటీఆర్ తన చెల్లిపై ప్రస్టేషన్ ను సీఎం పై చూపిస్తున్నారన్నారు. బీజేపీ పై ఎందుకు విమర్శలు చేయలేదని కవిత నేరుగా కేటీఆర్ ను ప్రశ్నించిందన్నారు.
Also Read:Ponnam Prabhakar: విధుల్లో నిజాయితీగా పనిచేయాలి.. రవాణాశాఖకు మంచి పేరు తేవాలి!
కవిత లెటర్ పై బీజేపీ, బీఆర్ ఎస్ లు స్పందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. బీఆర్ ఎస్ పార్టీలో దయ్యాలు ఎవరనేది? తేల్చుకోవాలన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం సరికాదన్నారు. ఆపద వచ్చినా..బయటకు వచ్చేలా లేడని మండిపడ్డారు. బీఆర్ ఎస్ పార్టీ లో నాయకులు తమ స్థానాలను రక్షించుకునేందుకు షో చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎంను ఇబ్బంది పెట్టేందుకే ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చేర్చారని వెల్లడించారు.
Also Raed: Covid-19 Cases TG: రాష్ట్రంలో కరోనా భయాలు.. మంత్రి కీలక ఆదేశాలు!