Ponnam Prabhakar: విధినిర్వహణలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లు(ఏఎంవీఐ) సక్రమంగా, నిజాయితీగా పనిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సచివాలయంలోశనివారం పెండింగ్ లో ఉన్న ఏఎంవీఐలకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. గతంలో 96 మంది ఏఎంవీఐలకు నియామక పత్రాలు అందజేశారు. పలు కోర్టు కేసుల్లో పెండింగ్ లో ఉండడంతో ఆలస్యం కావడంతో కోర్టు కేసులు క్లియర్ అయ్యాయి. దీంతో ఆరుగురు ఏఎంవీఐ లకు నియామక పత్రాలు అందజేసి వారికి సత్కరించి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Serilingampalli: నకిలీ పత్రాలతో వేరొకరి స్థలంలో బిల్డింగ్ నిర్మాణం.. భవనం సీజ్!
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విధిగా శిక్షణ తీసుకొని నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు. సమయపాలన పాటించాలని సూచించారు. రవాణా శాఖ కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఎవరిని కలువాల్సిన పనిలేదని, మీరంతా బాగా పనిచేయాలని, ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ , సీఎం సెక్రటరీ శ్రీనివాస్ రాజు , రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
Also Read: Covid-19 Cases TG: రాష్ట్రంలో కరోనా భయాలు.. మంత్రి కీలక ఆదేశాలు!