Bharosa Scheme: రాష్ట్ర ప్రభుత్వం నేతలకు భరోసా పథకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి నేత, అనుబంధ కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా రెండు విడుతలుగా వేతన ప్రోత్సాహం అందజేయనుంది. ఈ పథకంలో రాష్ట్రంలో 40వేల మంది చేనేత కార్మికులకు లబ్దిపొందనున్నారు.
18 ఏళ్లు నుండి జియో ట్యాగ్
నేత, అనుబంధ కార్మికులందరికీ నేతన్నకు భరోసా పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 40వేల మంది లబ్దిపొందనున్నారు. 18 ఏళ్లు నిండి జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరి పనులైన డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు, చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం పొందుతున్నవారు అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ పథకం కింద జియో ట్యాగ్ చేయబడిన మగ్గాల ద్వారా వార్పులలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన నేత, అనుబంధ కార్మికులకు నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోకి వేతన ప్రోత్సాహకం కింద సంవత్సరానికి రెండు విడతలుగా (ఏప్రిల్ -సెప్టెంబర్, అక్టోబర్ -మార్చి) నేత కార్మికుడికి రూ.9వేలు, అనుబంధ కార్మికుడికి రూ.3వేల జమ చేయడం జరుగుతుంది. మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయని వారు, రెండో విడతలో పూర్తి చేసినట్లైతే మొత్తం ప్రోత్సాహకం సంవత్సరాంతంలో చేనేత, అనుబంధ కార్మికులకు అందించబడుతుంది.
Also Read: YS Jagan: బాబూ.. అడ్డగోలు అప్పులు తప్ప ప్రజలకు చేసిందేంటి?
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్
నేతన్న భరోసా పథకానికి బడ్జెట్ లో రూ.48కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకు, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం కింద గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేలు అందించడం జరుగుతుంది. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా తయారుచేయబడిన యూనిక్ లోగోను జతచేయనున్నారు. తద్వారా చేనేత ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను, నేత కార్మికుడి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగే అవకాశాలు ఏర్పడనుంది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నేత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో నేత, అనుబంధ కార్మికులందరికీ నేతన్న భరోసా పథకం వర్తింపజేయనున్నాం. రాష్ట్రంలో దాదాపు 40 వేల మంది లబ్ధి పొందుతారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తెలంగాణ చేనేత అభయహస్తంలో భాగంగా తెలంగాణ నేతన్నకు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఈ నెల 2న జారీ చేశారు. ఇందుకోసం బడ్జెట్ రూ.48కోట్లు ప్రభుత్వం కేటాయించింది. చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. ఉపాధి మరింత పెరుగుతుంది.
Also Read: Kavitha’s Maha Dharna: రేపే కవిత మహాధర్నా.. మరి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటారా?