YS Jagan: బాబూ.. అడ్డగోలు అప్పులు తప్ప ప్రజలకు చేసిందేంటి?
Jagan On Chandrababu
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: బాబూ.. అడ్డగోలు అప్పులు తప్ప ప్రజలకు చేసిందేంటి?

YS Jagan: సీఎం చంద్రబాబు (CM Chandrababu), కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దిగజార్చటంపై జగన్‌ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. ‘ఎక్స్’ (Twitter) వేదిక‌గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కాగ్‌ (CAG), మోస్పి గణాంకాలతో ట్వీట్ చేశారు. ‘ ద‌శాబ్ధాల అనుభ‌వం ఉంద‌ని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏడాది పాల‌న‌లో రాష్ట్రానికి ఎలాంటి మంచి చేయ‌లేక‌పోయారు. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది? ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారు ఎందుకనీ..? రాజకీయ అనుభవంతో పాటు ముఖ్యమంత్రిగా కూడా పని చేసి, పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా? కానీ, ఆ అనుభవం ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?, తెచ్చింది? కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఓవైపు వాస్తవాలన్నీ ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేనే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్‌, మోస్పి గణాంకాలే తేటతెల్లం చేశాయి’ అంటూ చంద్రబాబు పనితీరుపై జగన్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు.

Read Also- KCR: కాళేశ్వరం విచారణకు సమయం కోరిన కేసీఆర్.. పెద్ద ప్లానే ఉందే!

రేపు తెనాలికి మాజీ సీఎం..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్.. రేపు (జూన్-03న) గుంటూరు జిల్లా తెనాలిలో ప‌ర్యటించ‌నున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని జ‌గ‌న్‌ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి తెనాలి ఐతానగర్‌ చేరుకుంటారు. అక్కడ ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.00 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం కానున్నారు. కాగా, పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడికి తెగబడటం, వారిని పట్టుకుని నడిరోడ్డుపై పోలీసులు లాఠీలతో అరికాళ్లపై కొట్టడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. బహిరంగంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఈ చర్యలను పోలీసు వర్గాలు మాత్రం సమర్థించుకుంటున్నాయి. పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి చేయడంతోనే.. వాళ్లను పట్టుకుని శిక్షించినట్లుగా పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై దళిత, మైనార్టీ సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనుకాడబోమని ఆయా సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

Vangalapudi Anitha

Read Also- Sharmishta Panoli: ఒకే ఒక్క ట్వీట్‌తో జైలుపాలు.. ఎవరీ శర్మిష్ఠ పనోలి.. ఎందుకింత రచ్చ?

అవును.. కొడితే తప్పేంటి?
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్పందించారు. సోమవారం విజయవాడలోని సత్యనారాయణపురంలో నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఘటనపై స్పందించారు. ‘ నేరస్థులకు కులం, మతం అంటూ రంగులు పూసి రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సుధాకర్, వరప్రసాద్‌ను అవమానించినప్పుడు వైఎస్ జగన్ ఎందుకు పరామర్శించలేదు? తెనాలిలో కానిస్టేబుల్‌పై రౌడీ షీటర్లు దాడి చేయడంపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అవును పోలీసులపై రౌడీ షీటర్స్ దాడికి ప్రయత్నించారు. పోలీసులను కొట్టినందుకే వాళ్లు అలా చేశారు. వాళ్లందరూ రౌడీ షీటర్స్, గంజాయి బ్యాచ్’ అని అనిత సమర్థించుకుంటున్నారు. హోం మంత్రి అయ్యుండి ఇలాంటి ఘటనలు సమర్థించుకోవడం ఏమిటి? ఇలాంటి చర్యలను సమర్థిస్తే పోలీసులు మరింత రెచ్చిపోరా? అంటూ దళిత, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే మంగళవారం తెనాలి పర్యటనకు వెళ్లినప్పుడు వైఎస్ జగన్ ఎలా రియాక్ట్ అవుతారు? ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Just In

01

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?