Minister Raja Narasimha: ప్రతి 25 కిలో మీటర్లకు ఓ డయాలసిస్ ను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) సూచించారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుపై శనివారం ఆయన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. 2009లో డయాలసిస్ సేవలు ప్రారంభించినప్పుడు 1230 మంది డయాలసిస్ పేషెంట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 12 వేలు దాటిందని తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. కిడ్నీ, కేన్సర్ జబ్బులు పెరగడంపై ఆందోళనకరం అన్నారు.
సెడెంటరీ లైఫ్ స్టైల్..
దేశంలో, రాష్ట్రంలో ఒకప్పుడు అంటువ్యాధుల సమస్య ఉండేదని, ఆ వ్యాధుల నియంత్రణకు అనుగుణంగానే మన వైద్య రంగం తయారు చేయబడిందన్నారు.కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, అంటువ్యాధులు తగ్గిపోయి, నాన్ కమ్యినికేబుల్ డిసీజ్‌లు పెరిగిపోయాయన్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన సెడెంటరీ లైఫ్ స్టైల్ వంటి అనేక కారణాల వల్ల కుగ్రామంలో కూడా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె జబ్బులు, కేన్సర్లు పెరుగుతున్నాయన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా వైద్య వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై స్టడీ చేయాలని, ఇతర దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌ల నివారణ, నియంత్రణ, చికిత్స అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలన్నారు.
Also Read: Sukumar Writings: సుకుమార్ రైటింగ్స్‌కు పది వసంతాలు.. సక్సెస్ రేట్ ఎంతో తెలుసా?
అన్నిరకాల వైద్య సేవలు
ఇక బీపీ, షుగర్లు వస్తే పోయేవి కాదు అని, కిడ్నీ జబ్బులు, కేన్సర్ల చికిత్స ఒక్కరోజుతోనే~ ఒక నెలతోనే పూర్తవ్వదన్నారు. ఆయా జబ్బుల బారిన పడిన ప్రజలకు చికిత్స అందించేందుకు అనుగుణంగా మన హాస్పిటల్స్ తయారు కావాలన్నారు.డయాలసిస్ పేషెంట్లు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారని, వారికి పెన్షన్ అందించి కొంత వరకూ ఆర్థికంగా బాసటగా నిలుస్తున్నామన్నారు. కానీ, అది మాత్రమే సరిపోదన్నారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణానికి సమీపంలోనే అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు ఉచితంగా డయాలసిస్ పేషెంట్లకు అందాలన్నారు.
ఇంటికి చేరుకునేలా వ్యవస్థ
డయాలసిస్ కోసం పదుల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండకూడదన్నారు. పేషెంట్లతో పాటు ప్రయాణించి, పేషెంట్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండొద్దన్నారు.పేషెంట్ ఒక్కరే వెళ్లి గంటల వ్యవధిలోనే తిరిగి ఇంటికి చేరుకునేలా వ్యవస్థను తయారు చేయాలన్నారు. ప్రస్తుతం102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, ఈ సెంటర్లలో సుమారు 7550 మంది పేషెంట్లు డయాలసిస్ చేయించుకుంటున్నారన్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటళ్లలో సుమారు మరో 5060 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Soil Mafia: మట్టి మాఫియా దందా.. పట్టించుకోని అధికారులు