TG High Court: మున్సిపల్ డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ, డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదిస్తూ, డీలిమిటేషన్ మ్యాప్‌లు, జనాభా లెక్కలు, సరిహద్దుల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కీలకమైన మ్యాప్‌లు, జనాభా వివరాలను ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచలేదని అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.
Also Read: TG High Court: సినిమా టికెట్ రేట్ల పెంపు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. మంత్రి సంచలన ప్రకటన
పునర్విభజన మ్యాప్‌ను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించాం
అభ్యంతరాలు తెలపడానికి తగిన సమాచారం ఇవ్వకపోవడంపై కోర్టు ఆరా తీసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, పునర్విభజన మ్యాప్‌ను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి మారకుండానే ఈ విభజన జరిగిందని, డీలిమిటేషన్ ప్రక్రియలో కోర్టుల జోక్యం ఉండకూడదని పేర్కొన్నారు. అయితే, ప్రక్రియలో అనుమానాలు ఉన్నప్పుడు జ్యుడీషియల్ రివ్యూ చేసే అధికారం ఉంటుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేయడానికి మరో రెండు రోజుల పాటు అదనపు గడువు ఇచ్చింది. ఈ మేరకు పూర్తి స్థాయి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, ప్రజల అభ్యంతరాల మధ్య సమతుల్యతను కోర్టు పరిగణనలోకి తీసుకోనుంది.
Also Read: TG High Court: సినిమా టికెట్ రేట్ల పెంపు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. మంత్రి సంచలన ప్రకటన

