Nursing Students: నర్సింగ్ విద్యార్ధులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. నర్సింగ్ విద్య విద్యార్ధులు అంతర్జాతీయ(International) స్థాయిలో సేవలందించేందుకు లాంగ్వేజ్ స్కిల్స్(Language skills) నేర్పించనుంది. ఇందుకోసం నర్సింగ్ కోర్సులతో పాటు, విద్యార్ధులకు విదేశీ భాషలు సైతం నేర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ(Department of Health) నిర్ణయించింది. నర్సింగ్ విద్య చదివే విద్యార్ధులకు ఇంగ్లీష్(Emglish) తో పాటు జర్మన్(Jarman), జపనీస్(Japanis), ఫ్రెంచ్(French) వంటి భాషలు నేర్పించనున్నారు. ఇందుకోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(English and Foreign Languages University) (ఇప్లూ)తో త్వరలో అధికారిక ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఇఫ్లూ తో ఒప్పందం
దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు.త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని 37 గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ(Nursing College)ల్లో విదేశీ భాషలు నేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) తో ఒప్పందం కుదుర్చుకోనున్నది. దీని వలన సుమారు 2500 మందికి పైగా విద్యార్ధులకు స్కిల్స్ ట్రైనింగ్(Skill Training) జరగనున్నది. అంతేగాక ఆయా దేశాల్లో లాంగ్వేజ్ స్కిల్ టెస్టులో సునాయసంగా రాణించగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది.
ఆయా దేశాల్లో లక్షల్లో జీతాలు
ఇటీవలి కాలంలో విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాల్లో లక్షల్లో జీతాలు ఇస్తుండటంతో నర్సింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఆయా దేశాల్లో అర్హత పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో లాంగ్వేజ్ స్కిల్స్ కోర్సులు నర్సింగ్ విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగ పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా విదేశాల్లో జాబ్స్ అవకాశాలు పెరగనున్నాయి.
Also Read: Viral Video: రీల్స్ కోసం వెర్రి వేషాలు.. కళ్లముందే కొట్టుకుపోయిన యూట్యూబర్!
