Telangana Govt: తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Govt) మరో చారిత్రాత్మక అడుగు వేసింది. సచివాలయంలో రెండు కొత్త పథకాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) ప్రారంభించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంతన్నా కా సహారా –మి స్కీన్ అనే పేరిట పథకాలను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కు సంబంధించిన పోర్టల్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
ఈ రెండు పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందన్నారు. ఇక ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు. ఈ రెండు పథకాలకే ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల అంకితభావానికి నిదర్శనమన్నారు.
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కు రూ. 50 వేలు, రేవంతన్న కా సహారా మిస్కీన్ ల కోసం రూ. లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేయనున్నారు. అక్టోబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. tgobmms.cgg.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గ్రంథాలయాల చైర్మన్ డా. రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Also Read: Sreenanna Andarivadu: 6 భాషల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి బయోపిక్.. హీరో పాత్రలో సుమన్
పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్‌క్లేవ్ ను నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ లో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డినాయకత్వంలో ఇటీవల నూతన పర్యాటక విధానాన్ని తీసుకొచ్చామన్నారు. పర్యాటకం కేవలం వినోదం కాకుండా ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టండి
తెలంగాణ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టండి.. వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రపంచస్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వనరులు తెలంగాణలో ఉన్నాయని, అయితే తెలంగాణ పర్యాటకానికి అనుకున్న స్థాయిలోప్రచారం లభించడకపోవడమే అసలైన లోటన్నారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసడర్లుగా నిలవాలని టూరిజం, ట్రావెల్స్, హాస్సిటాలిటీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
సమతా మమతలు వెల్లివిరిసేలా బతుకమ్మ
సమతా మమతలు వెల్లివిరిసేలా సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండగను జరుపుకుందామని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో బతుకమ్మ విశిష్టత – ఆచరణ అంశంపై సదస్సు నిర్వహించారు. కొన్ని తరాలుగా గ్రామీణ మహిళల నోళ్లల్లో నానుతున్న బతుకమ్మ పాటల స్పూర్తిని మరింత వెలుగులోకి తీసుకురావాలన్నారు. డీజే మోతలతో కాకుండా, ఆడుతూ పాడుతూ చప్పట్ల సప్పుడు, సవ్వడితో సంబరాలు జరుపుకుందామన్నారు. బతుకమ్మ సందర్భంగా జీవన విధ్వంసంపై పాటలు అల్లి పాడుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక సలహా మండలి కన్వీనర్ కోదండరాం , భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, జూపాక సుభద్ర, భవానిరెడ్డి, ఇందిరా శోభ, బి. నర్సింగరావు, పాల్గొన్నారు.
Also Read: KGBV Workers: కేజీబీవీ వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 వేలు ఇవ్వాలి.. టియుసిఐ డిమాండ్