TG Education Department (imagecredit:swetcha)
తెలంగాణ

TG Education Department: విద్యాశాఖలో సర్కార్ కీలక నిర్ణయం..? అడ్మిషన్లలో వారికి కూడా..?

TG Education Department: విద్యాశాఖలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. డిగ్రీ అడ్మిషన్లలో నాన్ లోకల్స్(non Locals) కూ అవకాశం ఇవ్వొచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే కేవలం స్పాట్ బెస్ట్ లో అడ్మిషన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇటీవల డిగ్రీ అడ్మిషన్ల లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయని, విద్యార్​ధులెవ్వరూ ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వ,ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దోస్త్ (Dost)ద్వారా మూడు విడతల సీట్ల కేటాయింపు జరిగినా, ఇంకా మెజార్టీ కాలేజీల్లో సీట్లు ఖాళీలు ఉన్నట్లు వివరించారు. దీంతో ప్రభుత్వం ఆఫీసర్ల కమిటీతో రిపోర్టు తెప్పించుకున్నది. సీట్ల భర్తీ, ఖాళీలపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్టడీ చేసింది. ఈ ఏడాది నాన్ లోకల్స్ కు అవకాశం ఇవ్వడం వలన, సీట్ల భర్తీ చేయొచ్చని ఆఫీసర్ల బృందం పేర్కొనగా, అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకొని ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలిచ్చినట్లు సమాచారం. లీగల్ గా చిక్కులు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ఆ ప్రాసెస్ స్పీడప్అయింది.

Also Read: Teachers Association: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి!

ఫీజులే..నో రీయింబర్స్మెంట్…?

స్పాట్ బేస్ట్ విధానంలో అడ్మిషన్లు పొందే నాన్ లోకల్ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ లభించదు. సొంతంగా ఫీజు చెల్లించుకోవాల్సిందేనని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే స్పాట్ అడ్మిషన్లలోనూ లోకల్స్ కే తొలి ప్రయారిటీ ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. జీవో నంబరు 15 స్థానికేతరులకు ఉన్నత విద్యలో అవకాశం లేదని స్పష్టం చేస్తుండగా, ఈ ఏడాది ఈ జీవోకు కాస్త రిలాక్సేషన్ కల్పించారు. దీని వలన మిగిలిన సీట్లు భర్తీ అవుతాయనే నమ్మకం ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ కు ఉన్నది. ప్రధానంగా బోర్డర్ జిల్లాలకు ఈ నిర్​ణయం వెసులుబాటు కల్పించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా డిగ్రీ కాలేజీ(Degree Colleges)లుండగా, సుమారు నాలుగు లక్షల వరకు సీట్లు ఉన్నాయి. ఇందులో గత ఏడాది కేవలం 50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అవగా, ఈ ఏడాది దోస్త్ కౌన్సిలింగ్ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతోనే నాన్ లోకల్స్ కు అవకాశం ఇస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Also Read: HC on Coolie: సెన్సార్ సర్టిఫికెట్ వివాదంపై.. ‘కూలీ’ నిర్మాతకు షాకిచ్చిన హైకోర్టు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?