Masala Raids
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Contaminated Spices: పొడిలో ఎలుకల మలం.. మసాలాలు వాడేవారికి వెగటు పుట్టించే వార్త

Contaminated spices: మసాలా తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ దాడులు

మసాలా తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ దాడులు
మిరియాల మసాలాలో ఎలుకల మలం ఉన్నట్లు గుర్తింపు
పలు కేంద్రాలకు నోటీసులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఫుడ్ సేఫ్టీ వింగ్ మరోసారి మసాలా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మసాలా తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి, లోపాలను గుర్తించి, పలు కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. దాదాపు 30కి పైగా మసాలా మాన్యుఫాక్చరింగ్, ప్యాకింగ్ సెంటర్స్‌పై దాడులు నిర్వహించిన అధికారులు నిర్ఘాంతపోయే వాస్తవాలు (Contaminated spices) వెలుగులోకి తీసుకొచ్చారు. పలు మసాలాకేంద్రాల్లో ఎలుకల మలం కనిపించడంతో అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా స్పైసెస్ తయారు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. చిల్లి పౌడర్, పసుపు, మిరియాలు, కరివేపాకు పొడి, ధనియాల శ్యాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.

రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని శ్రీవారి స్పైసెస్, బండ్లగూడ జాగీరులోని డివైన్ స్పైసెస్‌లు అపరిశుభ్ర వాతావరణం లో మసాలాలు తయారు చేస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మిరియాలు, ఇతర మసాలాల్లో ఎలుక మలం ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకులు అవే మసాలాలు ప్యాకింగ్ చేసి షాప్స్ కి పంపుతున్నట్లు కూడా నిర్థారించారు. గడువు ముగిసిన, లేబుల్ లేని ప్రొడక్ట్స్ స్టోర్ చేసినట్లు గుర్తించి, నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Read Also- Mohammed Shami: బీసీసీఐ సెలక్టర్లపై మహ్మద్ షమీ షాకింగ్ కామెంట్స్

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

35 టన్నుల బియ్యం స్వాధీనం.. అదుపులో లారీ డ్రైవర్

మేడ్చల్, స్వేచ్ఛ: అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మంగళవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కండ్లకోయ టోల్ గేట్ వద్ద లారీలో(GJ 36V 8886) రేషన్ బియ్యం తరలిస్తున్నారని పక్క సమాచారంతో మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న 35 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ ఇర్ఫాన్ భాయ్ ను అదుపులోకి తీసుకొని ఒక సెల్ ఫోన్ లారీను సీజ్ చేసి మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also- Railway Diwali Alert: దీపావళి వేళ రైల్వే ప్యాసింజర్లకు అలర్డ్.. ఈ రూల్ తెలియకుంటే జైలుకెళ్లే ప్రమాదం!

 

Just In

01

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి