Yadadri Collector: జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి అధికారులైన కలెక్టర్లు, సన్మానాలకు, ప్రశంసలకు ఆమడ దూరంలో ఉంటారు. నిబంధనల ప్రకారం, తమ పనులు తాము చక్కబెడుతూ జిల్లా అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తుంటారు. వారు తీసుకునే నిర్ణయాలు ఎందరో అభాగ్యులకు మేలు చేస్తుంటాయి. అభాగ్యులకు అండగా నిలుస్తూ, అభివృద్ధికి బాటలు వేస్తుంటాయి. అలాంటి అధికారుల సేవలను లబ్దిదారులు ఎప్పటికీ మరచిపోలేరు. కొందరు వేర్వేరు విధాలుగా కృతజ్ఞతలు, తద్వారా అభిమానాన్ని చాటుతుంటారు. అలాంటి ఘటనే ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లా చోటుచేసుకుంది.
జిల్లా కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం.. ఎందుకంటే?
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ఆరెగూడెం, ఇందిరానగర్ కాలనీకి సంబంధించిన రేషన్ షాప్ నంబర్ 4408002 ఆరెగూడెంలో ఉంది. అయితే, దీంతో ఇందిరానగర్ వాసులు ప్రతినెలా రేషన్ సరుకుల కోసం ఆరెగూడెం వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, రవాణా సౌకర్యం లేక వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు అవస్తలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు లేని నిరుపేదలు, చేతికి అందిన పిల్లలు లేనివారు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వెల్లడించారు. ఇందిరానగర్‌లో కూడా రేషన్ సరుకులు ఇప్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో రేషన్ సరుకులు తెచ్చుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు రేషన్ డీలర్ లక్ష్మయ్య సహకారంతో ఇందిరానగర్ ఎస్సీ కమిటీ హాల్ బిల్డింగ్‌లో ఇందిరానగర్‌కు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. దీంతో, కలెక్టర్ హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలు పాలాభిషేకం చేశారు.
Read Also- Ramya Gopal Kancharla: బిగ్ బాస్ టీమ్ నిండా ముంచేసింది.. దారుణంగా మోసం చేశారు.. రమ్య మోక్ష ఆవేదన
