Ramya Gopal Kancharla: బిగ్ బాస్ మొదలైన రెండు వారాలు తర్వాత బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కాంట్రవర్సీ క్వీన్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష కి అవకాశం ఇచ్చారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు, ఆమె గ్లామర్, రీల్స్ డాన్స్‌లతో రచ్చ చేసింది. కాకపోతే వెళ్లిన మొదటి వారంలోనే ప్రేక్షకుల ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. అయితే, ఆమె బయటికొచ్చాక యూట్యూబ్ లో వీడియో చేసి అప్లోడ్ చేసింది. దీనిలో బిగ్ బాస్ పై ఆరోపణలు చేసింది.
ఆమె మాట్లాడుతూ ” బిగ్ బాస్ వాళ్లు అసలేం చూపించలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అలాగే బయట లోపల ఉన్నప్పుడు చాల పాజిటివిటీ ఉంది నాకు. లోపల హౌస్ లో కూడా కొన్ని మంచి పరిస్థితులు ఉన్నాయి. అవేమి కూడా వీళ్ళు చూపించలేదు. నెగిటివ్ ఒకటో రెండో అవి మాత్రమే చూపించారు. నా మీద పాజిటివిటీ ఎక్కడా క్రియోట్ చేయలేదు. మొత్తానికి నాకేం అర్థమైదంటే నెగిటివ్ నన్ను కంప్లిట్ గా చూపిద్దామని బిగ్ బాస్ కు పిలిచారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ ” ఇంకా కొన్ని మీమ్స్ చూశా.. నేను స్నాప్ చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను.. నా ఫేస్ ను. చుడండి అని నా ఫేస్ ను చూపిస్తూ స్క్రీన్ మీద మీద కనిపించినట్టు రౌండ్ గా .. బాల్ లాగా ఉంది. ఫోటోలైతే ఎడిటింగ్ అంటున్నారు. వీడియోలో ఇప్పుడు చూడండి. ఇవి నేను ఎలా ఎడిట్ చేస్తాను. స్నాప్ చాట్ నాకు లేదు. అసలు దాన్ని వాడటం కూడా తెలియదు. స్కిన్ టోన్ కూడా ఫేక్ చేసింది. ఇప్పుడు వైట్ గా లేదని అంటున్నారు. నేను హైద్రాబాద్ కు వెళ్తే నాకు అక్కడ వాటర్ పడవు. అందుకే అలా ఉన్నాను ” అంటూ క్లారిటీ ఇచ్చింది.
Also Read: Koppula Eshwar: ఎస్సీ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు
