Mega Job Mela: ఈ నెల 29న తాండూరులో నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాబ్ మేళా నిర్వహణపై తాండూరు శాసన సభ్యులు బయ్యని మనోహర్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ (ఇజీఎంఎం) ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ను నిర్వహించడం జరుగుతుందన్నారు.
52 పారిశ్రామిక రంగాల్లో 11 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈనెల 29న తాండూర్ లో నిర్వహించే జాబ్ మేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాబ్ మేళాకు విచ్చేసే నిరుద్యోగులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. తాండూరు శాసన సభ్యులు బి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తాండూర్ లోని వినాయక కన్వెన్షన్ నందు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు.
Alos Raed: Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్.. నిపుణులతో చర్చించి తర్వాత నిర్ణయం!
గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు సమాచారాన్ని చేర వేసేందుకు అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. జాబ్ మేళాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా స్టాళ్లను ఏర్పాటు చేసి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఇజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణన్, జెడిఎం సతీష్, తాండూర్ సిడిపిఓ శ్రీలత, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, ఎంపీడీవోలు, ఎంపిఓలు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా పని చేయాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!