Kaleshwaram project (imagecredit:twitter)
తెలంగాణ

Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్.. నిపుణులతో చర్చించి తర్వాత నిర్ణయం!

Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుఅవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తొలిసారి కమిషన్ ముందుకు రావాలని నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. అందులో భాగంగానే కమిషన్ ఈ నెల 20న కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. జూన్ 5న హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. 15 రోజుల్లో రిప్లై తో పాటు కమిషన్ ఎదుట హాజరుకావాలని సూచించింది. దీంతో కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పై తీవ్ర విమర్శలు చేస్తుంది. కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మించారని, దాంతో పాటు ఎస్టిమేషన్ పెంచారని, అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తుంది. దీనికి చెక్ పెట్టాలంటే కమిషన్ ముందుకు రావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

మేడిగడ్డ ఫిల్లర్లకు మరమ్మత్తులు

కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది? ప్రాజెక్టుకు ఎస్టిమేషన్ ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఈ ప్రాజెక్టుతో ఎన్నిఎకరాలకు నీరందించిన వివరాలు, వరి దిగుబడిలో సాధించిన విజయం, ఎన్ని జిల్లాల ప్రజలకు నీరందించిన వివరాలు, భూగర్భజలాలు పెరగడానికి ఎలా ప్రాజెక్టు దోహదపడింది? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అప్పగి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరును ఎండగట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా తమ్మిడి హెట్టి దగ్గర నీటి లభ్యత ఉంటే ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదు. కాళేశ్వరం దగ్గర ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే వివరాలను కమిషన్ కు వివరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మేడిగడ్డ ఫిల్లర్లకు మరమ్మతులు చేయకపోవడంతో యాసంగిలో రైతాంగం ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం వివరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమిషన్ ముందు ఏయే అంశాలు ప్రస్తావించాల్సిన అంశాలపైనా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కమిషన్ విచారణ అనంతరం అవసరం అయితే మీడియా ముందు సైతం వివరాలను వెల్లడించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ ఎదుట హాజరుపై కేసీఆర్, హరీష్ రావు భేటీ అయిన విషయం తెలిసింది. ఎంపీ ఈటల రాజేందర్ సైతం వచ్చేనెల 9న కమిషన్ ముందుకు హాజరవుతానని ప్రకటించారు.

Also Read: MP Raghunandan: కవిత కొత్త పార్టీ వెనక కేసీఆర్.. త్వరలో పాదయాత్ర.. బీజేపీ ఎంపీ

ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మేడిగడ్డ కుంగిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సైతం నీరు లీకేజీ అవుతుందని, ప్రమాదం అంచులో ఉన్నాయని విచారణ కమిషన్ ను ప్రభుత్వం నియమించగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డీఈలు, ఎస్‌ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను, నిర్మాణ సంస్ఠల ప్రతినిధులను సైతం కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్లరూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్,నీటిపారుదల, ఆర్థికశాఖల అధికారులను సైతం విచారణ చేసింది.

డైజన్ ఎంపికలో కేసీఆర్

ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ విచారణ చేసింది. ఈ విచారణలో ఎక్కువ మంది కేసీఆర్‌ పేరే చెప్పినట్లు సమాచారం. బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపిక, డైజన్ ఎంపిక లో సైతం కేసీఆర్ చెప్పినట్లే చేశామని పేర్కొన్నట్లు తెలిసింది. స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్ చేసినట్లు నిర్ధారణకు వచ్చి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు 400 పేజీల డాక్యూమెంటరీని సైతం సిద్ధం చేసింది. అయితే కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ను విచారించిన తర్వాత తుది రిపోర్టును ప్రభుత్వానికి కమిషన్ అందజేయనున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ముందు కేసీఆర్ హాజరుఅవుతారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: Jal Shakti Abhiyan: జలశక్తి అభియాన్‌లో దేశంలోనే.. తెలంగాణ 3వ స్థానం!

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు