MP Raghunandan (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

MP Raghunandan: కవిత కొత్త పార్టీ వెనక కేసీఆర్.. త్వరలో పాదయాత్ర.. బీజేపీ ఎంపీ

MP Raghunandan: తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన కవిత లేఖపై మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చారు. తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా? దెయ్యాలు ఉన్నాయా? అన్న విషయంపై చర్చ జరుగుతుందోని రఘునందన్ రావు అన్నారు. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారని కవితను ప్రశ్నించారు.

కేసీఆర్ ఫ్యామిలీ.. కొత్త నాటకం
మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. స్థానిక మాంకాలమ్మ గుడిని దర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫ్యామిలీ కొత్త నాటకానికి తెరలేపాయని చెప్పారు. ఒకరితో గొడవ పడితే మరొకరి దగ్గరికి పోయేలా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆరే పార్టీ పెట్టిస్తున్నారు!
మాజీ సీఎం కేసీఆర్.. తన బిడ్డ కవితతో కొత్త పార్టీ పెట్టించబోతున్నారని మెదక్ ఎంపీ ఆరోపించారు. ఆమె చేత పాదయాత్ర కూడా చేయించబోతున్నారని పేర్కొన్నారు. కవిత తన పాదయాత్ర ద్వారా మరో షర్మిల అవుతుందని రఘునందన్ రావు అన్నారు. తన రాజకీయ పరిజ్ఞానం ప్రకారం కవిత సొంత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యిందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టవచ్చని చెప్పారు. ఆ తర్వాత పాదయాత్ర చేయవచ్చని అంచనా వేశారు.

ముందే చెప్పిన స్వేచ్ఛ!
కవిత కొత్త పార్టీ పెట్టే విషయంపై ఇప్పటికే స్వేచ్ఛ ఎక్స్ క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది. పార్టీ జెండా సైతం ఏ రంగులో ఉంటుందో తెలియజేసింది. పార్టీకి టీబీఆర్ఎస్ అని నామకరణం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భవించిన నేపథ్యంలో అదే రోజున పార్టీ గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: MLC Kavita New Party: జూన్ 2న కవిత కొత్తపార్టీ?

కేటీఆర్‌తో విభేదాలే కారణమా?
అయితే కవిత కొత్త పార్టీ పెట్టడానికి కేటీఆర్ తో విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో కవిత జైలుకు వెళ్లారు. విడుదలైన తర్వాత జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు పార్టీ అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఆమె పర్యటిస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుందని, కట్టడి చేయాలని భావించినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమెకు కేటీఆర్ కు మధ్య గ్యాప్ వచ్చిందని, అంతేగాకుండా ఆమెకు పార్టీ కూడా ఆశించిన స్థాయిలో సపోర్టు చేయడం లేదని ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ సైతం కవిత ప్రచారం చేయవద్దని అధినేత కేసీఆర్ తో పేర్కొన్నారనే ప్రచారం జరిగింది. అయినా కవిత యాక్టీవ్ గా తిరుగడంతో పార్టీకి నష్టం జరుగుతుందని అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో కేటీఆర్, కవిత విభేదాలు వచ్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read This: TDP Mahanadu 2025: మహానాడులో సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. జగన్ జైలుకు వెళ్లాల్సిందేనా!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు