Bulkapur Nala: పట్టించుకోని వైనం
-ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆగడాలు
-చెరువుల, నాలాల కాపాడటంలో హైడ్రా నిర్లక్ష్యం
గండిపేట్, స్వేచ్ఛ: కబ్జాదారుల ధనదాహానికి బుల్కాపూర్ నాలా అన్యాక్రాంతమవుతుంది.. స్థానికంగా రాజకీయ బలం కలిగిన నాయకుల తెంపరితనానికి నాలాలు పూర్తిగా అన్యాక్రాంతమవుతున్నాయి.. రాజకీయ బలం ఉంది. తమను ఎవరూ ఏం చేయలేరని కొందరు కబ్జాకోరులు నాలాలను సైతం వదలడం లేదు. ఏకంగా నాలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలకే తెరలేపుతున్నారు. బుల్కాపూర్ నాలా కబ్జా(Bulkapur Nala occupation) చేసి నిర్మాణాలు చేస్తుంటే అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు.. నిర్మాణాల విషయం అధికారులకు తెలిసినా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ ఆక్రమణలు జరిగి ఉండవచ్చనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల సహకారంతో..
గండిపేట్ మండల పరిధిలోని మణికొండ మున్సిపల్(Manikonda Municipal) మణికొండ మర్రిచెట్టు సమీపంలోని సర్వే నెంబర్ 262 బుల్కాపూర్ నాలా ఉంది. బుల్కాపూర్ నాలాను మూసివేసి అమృత కన్స్ట్రక్చన్స్ నిర్మాణదారులు బుల్కాపూర్ నాలాను మూసి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఈ ఆక్రమణలపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఉందా లేదా అని ప్రజల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అధికారుల సహకారంతోనే ఆక్రమణలు సజావుగా సాగాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రానున్న కాలంలో బుల్కాపూర్ నాలా ఫలానా చోటు ఉండేదని పేపర్లు, బుక్కుల్లో చదువుకునే పరిస్థితులు వస్తాయా అని ప్రజలు పేర్కొంటున్నారు. బుల్కాపూర్ నాలాను ఆనుకొని నిర్మాణం చేస్తున్న బఫెలో 40 మీటర్లు ఉండాలని స్థానికులు చెబుతున్నా, అధికారులు 20 మీటర్లు అంటున్నారు అధికారులు చెప్పిన లెక్క ప్రకారం అయినా అక్కడ బఫర్ జోన్ విడిచి నిర్మాణాలు చేస్తున్నారంటే అదిలేదు, అధికారులు వస్తే వారిని ఎలాబుట్టలో వేసుకోవాలో నిర్మాణదారులకు కొట్టినపిండి అని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.
Also Read: Viral News: బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నా అని చెప్పి.. థాయ్‌లాండ్‌లో ప్రేయసితో పట్టుబడ్డ భర్త!
కాలనీలు ముంపుకు గురై..
అక్కడ బుల్కాపూర్ నాలా ఉన్నప్పటికీ ఆయా నిర్మాణాలకు మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్(Municipal Town Planning) నుంచి, ఇరిగేషన్(Irrigation) అధికారులు, రెవెన్యూ(Revenue) అధికారులు అనుమతులు ఎలా ఇస్తారని స్థానిక ప్రజలు అడుగుతున్నారు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తుంటే ప్రశ్నించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం అక్రమ నిర్మాణదారులకు వరంలా మారిందని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. నాలాల బఫర్ జోన్ లో స్థానిక లీడర్ల సపోర్టుతో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం కాలనీలు ముంపుకు గురైన నేపథ్యంలో నాలాలను విస్తరించేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలు కేవలం ప్రాథమిక స్థాయిలోనే నిలిచిపోయాయి. ప్రభుత్వ అనుమతులు రాక విస్తరణ ముందుకు సాగడం లేదు. నిర్మాణాలు కట్టుకోవాలంటే టీఎస్ బీపాస్(TS- Bpass) లో అప్లై చేసుకొని, చుట్టుపక్కల నాలాలు, చెరువులుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(No Objection Certificate) కూడా సమర్పించాలి. కానీ నిర్మాణదారులు ఇవేమి చేయకుండా బుల్కాపూర్ నాలాను నాలాను పూర్తిగా పూడ్చివేసి దానిని ఆనుకొని నిర్మాణం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా నిద్రమత్తును వదిలి బుల్కాపూర్ నాలాను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
హైడ్రా నిద్రపోతుందా..!
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ లో నాలా కనుమరుగవుతుంది. ఈ విషయంపై స్థానిక ప్రజలు హైడ్రా(Hydraa) అధికారులకు ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం గుర్రు పెట్టి నిద్రపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు విమర్శిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కనీసం బుల్కాపూర్ నాలా పరిశీలించకపోవడం, నాలా కబ్జాకు గురవుతుంటే చర్యలు ఎందుకు చేపట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా అక్రమంగా ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జాలు చేస్తుంటే సత్వరమే స్పందించే హైడ్రా విభాగం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా హైడ్రా విభాగం అధికారులు అయినా నిద్రమత్తును వీడి అక్రమంగా నాలాను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: MLC Kavitha: మా మేనమామ ఉండేవారు.. అప్పట్లో ఇక్కడికి చాలా సార్లు వచ్చా.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

