MLC Kavitha: అప్పట్లో ఇక్కడకి చాలా సార్లు వచ్చా: కవిత
MLC-Kavitha (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

MLC Kavitha: మా మేనమామ ఉండేవారు.. అప్పట్లో ఇక్కడికి చాలా సార్లు వచ్చా.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

MLC Kavitha: వచ్చి చూసి పోయారు.. ఏమీ చేయలేదు

నాగారం మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన

దమ్మాయిగూడ (నల్గొండ), స్వేచ్ఛ: దమ్మాయిగూడలో తన మేనమామ ఉండే వారని, తాను గతంలో ఇక్కడికి చాలాసార్లు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో (BRS), రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో (Congress) కూడా ఇక్కడి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె విమర్శించారు. ఎక్కడ ఉన్న గుడిసె అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందని విమర్శించారు. అందుకే ఈ పరిస్థితి మారాలని తాను ముందుకు వచ్చానని కవిత పేర్కొన్నారు.

పార్టీ నుంచి సస్పెన్షన్‌పై మాట్లాడుతూ..

ప్రజలకు మంచి చేయాలని తాను గట్టిగా అడిగితే బీఆర్‌ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిందని కవిత చెప్పారు. ‘‘ఇప్పుడు నేను బీఆర్‌ఎస్‌లో లేను. ఆ పార్టీ నుంచి రాలేదు. దాదాపు 19 ఏళ్ల పాటు జాగృతి తరపున నేను బతుకమ్మ, బోనాలు ఎత్తుకొని పోరాడాను’’ అని కవిత పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కూడా చాలా మందికి పెన్షన్లు రాలేదని, ఈ విషయం తాను ప్రశ్నించేసరికి కేసీఆర్ తనను పార్టీ నుంచి తీసేశారని కవిత పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నుంచి తొలగించాక ఏం చేయాలని చాలా మందిని అడిగితే, కష్టం వచ్చిందని ఆగిపోవద్దని అందరూ ధైర్యం చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. అందుకే ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని కవిత తెలిపారు.

Read Also- Navjot Singh Sidhu: రూ.500 కోట్లతో సూట్‌కేస్ ఇచ్చే వ్యక్తే సీఎం.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అంతటా పర్యటన

ప్రస్తుతం తనకు అధికారం లేదని, బీఆర్‌ఎస్‌తో కూడా లేనప్పటికీ తెలంగాణ అంతా తిరుగుతున్నానని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే 12 జిల్లాలు పర్యటించానని, తాము మాట్లాడిన సమస్యల్లో చాలా వాటిపై కదలిక వస్తోందని ఆమె అన్నారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు కూడా తీరే పరిస్థితి వచ్చిందని, సమస్యలు పరిష్కరమయ్యే దాకా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోనని ఆమె అన్నారు. దమ్మాయిగూడలో కనీసం రేషన్ షాప్, ప్రాథమిక పాఠశాల, బస్తీ దవాఖానా లేవని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ కారణంగా ఇళ్లలో షాక్ వచ్చినట్లు అవుతోందన్న స్థానికుల సమస్యను ఆమె ప్రస్తావించారు. వీటిని వెంటనే సరిచేయించాలని, రేషన్ షాప్, దవాఖానా, పాఠశాల ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

సర్కారు హామీలపై విమర్శలు

ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మస్త్ మాటలు చెప్పారని కవిత విమర్శించారు. దమ్మాయిగూడలోని నాలాను అద్దంలా మెరిసేలా చేస్తానని హామీ ఇచ్చి, పనులు ప్రారంభిస్తున్నట్లు కొబ్బరి కాయ కూడా కొట్టినా, ఇప్పటి వరకు ఏ పనీ జరగలేదని కవిత దుయ్యబట్టారు. సాయంత్రం 6 దాటితే డోర్లు బంద్ చేయాల్సిన పరిస్థితి ఉందని, నాలా క్లీన్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచుతా, తులం బంగారం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎవరైనా బంగారం ఇచ్చారా? అని ప్రశ్నించి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. గతంలో ఆడపిల్ల లేదా మగపిల్లవాడు పుడితే వచ్చే డబ్బులను కూడా ప్రభుత్వం బంద్ పెట్టిందని కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 40 వేల వరకు కట్టిన ఇళ్లు ఉన్నాయని, అవసరం ఉన్న వారికి వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దమ్మాయిగూడలో ఇళ్లు అవసరం ఉన్న వారి పేర్లను రాసుకుంటామని చెప్పారు.

Read Also- Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వ స్కూల్‌లో దారుణం.. జూనియర్ల దాడిలో ఇంటర్ విద్యార్థి మృతి

స్కూల్, నాలా, దవాఖానా తెచ్చుకునే వరకు వదిలిపెట్టబోమని కవిత పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు నేను అధికారంలో లేను. కానీ మీకోసం పోరాడుతూనే ఉంటా. కానీ నాతో పాటు అవసరమనుకున్నప్పుడు మీరు రావాలి. అప్పుడే బలం ఉంటుంది. ఇక్కడ ఉన్న యూత్ కచ్చితంగా రాజకీయ నాయకులను ప్రశ్నించాలి. వాళ్లు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు మనం అసలే ఊరుకోవద్దు. మా స్థానిక జాగృతి నాయకులు ప్రజల సమస్యలు తీరే వరకు పోరాటం చేస్తారు’’ అని కవిత హామీ ఇచ్చారు.

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!