Ganja Plants: ‘పత్తి, కంది పండిస్తే చేతికి వచ్చేదేంది?’ అని అనుకున్నారు ఆ రైతులు. చివరికి అధిక ఆదాయం కోసం అంతర్ పంటగా గంజాయి సాగు మొదలుపెట్టి దందా ప్రారంభించారు. ఈ క్రమంలో ఎక్సైజ్ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. వికారాబాద్ జిల్లా కాటేపల్లి మండలం బార్వాడ్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రభాకర్, పెంటయ్య అనే ఇద్దరు రైతులు తమ పత్తి, కంది పొలాల్లో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నారు. దీనిపై సమాచారం అందటంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీ చేయగా పొలంలో 108 గంజాయి మొక్కలు దొరికాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్‌లో రూ.12 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు.
రైతు బంధు ఆపండి
పంట చేలలో గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డ ఎర్రోళ్ల ప్రభాకర్(Errolla Prabhakar), పెంటయ్య(Pentaiah)లకు రైతు బంధు నిధులు ఇవ్వటాన్ని నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్‌కు ఎక్సైజ్ అధికారులు లేఖ రాశారు. అరెస్ట్ చేసిన ఇద్దరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేశారు. మరోవైపు, ఒడిషా(Odisha) నుంచి గంజాయి తీసుకువచ్చిన ముగ్గురిని సంగారెడ్డి(Sangareddy) ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారుతోపాటు 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి 65పై ఉన్న మల్కాపూర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా, అరుణ్ నాయక్, సాయి ప్రవీణ్, విజయేందర్‌లు కారులో దొరికారు. విచారణలో వీరు ఒడిషాకు చెందిన సోలా మారి అనే వ్యక్తి నుంచి గంజాయి కొని తెచ్చినట్టు వెల్లడించడంతో అతనిపై కూడా కేసులు నమోదు చేశారు.
Also Read: Indigo flight cuts: ఇండిగోకి కేంద్రం షాక్.. సంచలన ఆదేశాలు జారీ
నాంపల్లి స్టేషన్ వద్ద దాడులు
నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టుగా తెలిసి ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. ఎస్టీఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేసి సుమిత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో ఉపాధ్యాయ బిజూ, చందా, అజయ్, నిరంజన్, సొహల్‌లకు కూడా సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలడంతో, వారిపై కూడా కేసులు నమోదు చేశారు.
Also Read: Harish Rao: ఆ పేరు పెట్టడం భారతీయులను అవమానించడమే: హరీశ్ రావు

