Power Scam: విద్యుత్​ శాఖలో జిగేల్ జిమ్మిక్కులు.. జోరుగా దందాలు
Power Scam (imagecredit:twitter)
రంగారెడ్డి, హైదరాబాద్

Power Scam: విద్యుత్​ శాఖలో జిగేల్ జిమ్మిక్కులు.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జోరుగా అధికారుల దందా..!

Power Scam: విద్యుత్​ శాఖలో తప్పుడు పత్రాలతో అనుమతి
–కాంట్రాక్టర్లతో కుమ్మక్కైనా అధికారులు
–అనుమతి రెండు అంతస్థులు.. నిర్మాణాలు అంతకు పైనే
–అడిగినంత తడపకపోతే అనుమతులుండవ్​
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: బహుళ అంతస్థులకు విద్యుత్ సరఫరా కనెక్షన్​ అనుమతి దక్కించుకునేందుకు తప్పటడుగులు వేస్తున్నారు. జీహెచ్​ఎంసీ(GHMC), హెచ్​ఎండీఏ(HMDA), మున్సిపాలిటీ(Muncipality)ల పరిధిలో ఆ ప్రాంతాలకు అనుగుణంగా ఇచ్చే అనుమతులకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో నిర్మాణాదారులు సంబంధింత అధికారుల వద్ద అక్యుపెన్సీ సర్టిఫికేట్లు(Occupancy certificates) తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సెక్షన్​ పరిధిలోని ఏఈ, డివిజన్​, సర్కిల్​ పరిధిలోని ఇంజనీర్లు సైతం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కనెక్షన్​ మంజూరు అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలోని అధికారుల అనుమతితో తప్పుడు ఓసీ(OC)లను సృష్టించి విద్యుత్​ కనెక్షన్లకు అనుమతి పోందుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ ఓసీల దందా ఉమ్మడి రంగారెడ్డి(Rangareddy) జిల్లా పరిధిలో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్ ఇంజనీర్ల నిర్లక్ష్యంతో..

జిల్లాలోని ప్రైవేట్​ విద్యుత్ కాంట్రాక్టర్లు వినియోగదారులను, విద్యుత్ శాఖాధికారులను మోసం చేస్తున్నారు. హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీల పేరుతో తప్పుడు అక్యుపెన్సి సర్టిఫికేట్లతో పాటు సీఈఐజీ(CEIG) అనుమతి పత్రాలు సమర్పిస్తారు. ఆ సమయంలో క్షేత్రస్ధాయిలోని ఇంజనీర్లు పత్రాలను పరిశీలించకుండా కనెక్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో సరూర్నరగ్​ సర్కిల్​ పరిధిలో సీఈఐజీ అనుమతినిచ్చిన పత్రాలను ఫోర్జరీ సంతకాల(Forged signatures)తో ఓ కాంట్రాక్టర్​ అధికారులకు సమర్పించారు. దీంతో తప్పుడు పత్రాలతో అనుమతులు తీసుకుంటున్నారనే ప్రచారం బహిర్గతమైయింది.

Warangal Crime: భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. కత్తితో దాడికి ప్రయత్నించిన భార్య..!

ప్రతి నెల వేలల్లో దరఖాస్తులు

బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్(Hyderabada)​లోనే జరుగుతున్నాయి. ప్రస్తుత గ్రేటర్​ హైదరాబాద్​లో 65లక్షలకు పైగా విద్యుత్​ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల వేలల్లో కొత్తగా దరఖాస్తులు వస్తున్నాయి. వీటిలో అధికంగా గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్థులు, మల్టి స్టోరేజీ బిల్డింగ్, పరిశ్రమలు నిర్మాణాలు చేస్తారు. అయితే తాత్కలికంగా కనెక్షన్లతో ప్రారంభమై డిమాండ్​కు తగ్గట్టుగా విద్యుత్​ వినియోగం కోసం అనమతులు తీసుకుంటారు. నిబంధనల ప్రకారం సుమారుగా 25 కీలో వాట్లకు పైన ఉన్న లోడు కావాలంటే కచ్చితంగా నిర్మాణానికి అనుమతులిచ్చిన పరిపాలన నుంచి ఓసీ తీసుకోవాలి. ఆ తర్వాత అంతర్గతంగా సరఫరా చేసే విద్యుత్​ లైన్లు స్వీచ్ఛ్, ఫ్యూజులు, కండక్టర్లు, డీటీఆర్​లు, తదితర విద్య పరికరాలు సీఈఐజీ నిబంధనలకు అనుగుణంగా వినియోగిస్తున్నట్లు సీఈఐజీ ఎన్​వోసీ ఇవ్వాలి. ఈ పత్రాలన్ని సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్​ శాఖాధికారులు అనుమతికి గ్రీన్​ సిగ్నల్ ఇస్తారు. కానీ గచ్చిబౌలి టీఎన్జీవో ఫేజ్-2కాలనీలో జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేని నాలుగంతస్తుల భవనానికి మీటర్లు జారీ చేశారు. ఇదే కాలనీలో పది మీటర్ల కంటే ఎత్తు నిర్మించిన భవనానికి సైతం ప్యానల్ బోర్డులు, మీటర్లు జారీ చేశారు. కంచ గచ్చి బౌలిలో రెండు భవనాలకు, నానక్రాంగూడలోని మరో భవనానికి ప్యానల్బార్డులు, డీటీ ఆర్లు మంజూరు చేశారు. గౌలిదొడ్డిలో కనీస అనుమతులు లేని ఓ ఐదంతస్తుల భవనానికి మీటర్లు జారీ చేయడాన్ని పరిశీలిస్తే అక్రమార్కుల ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

శివారు ప్రాంతల్లో అడ్డు అదుపు లేదు

శిఖం, బఫర్​ జోన్లు, వివాదాస్పద, నిషేధిత జాబితాలోని భూముల్లో జోరుగా నిర్మాణాలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఈ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని చోట్ల అధికారులు నిబంధనలకు విరుద్దంగా నిషేధిత జాబితాల్లో నిర్మించే భవనాలకు ఓసీ, ఎన్​వోసీలు ఇవ్వడం లేదు. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు తప్పుదు పత్రాలను సృష్టించి అనుమతులు పోందుతున్నారు. ఏదీ ఒరిజినలో.. ఏదీ నకిలీనో గుర్తించే వ్యవస్థ డిస్కం వద్ద లేకపోవడం ఇటు కాంట్రాక్టర్లు, అటు క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కలిసి వస్తోంది. అమీన్పూర్, పటాన్చెరు, గచ్చిబౌలి, కంచ గచ్చిబౌలి, గౌలి దొడ్డి, కొండాపూర్, అయ్యప్పసొసైటీ, టీఎనీఓస్ కాలనీ, గోపన్పల్లి, అంజయ్యనగర్, శంషాబాద్. మోకిల, నార్సింగి, మొయినాబాద్, కోకాపేట్, వట్టి నాగులపల్లి, చిలుకూరు, సరూర్నగర్, మేడ్చల్ కీసర, బైరమల్గూడ, తుర్కయంజాల్, బడంగ్ పేట్, ఆదిబట్ల, తుక్కుగూడ, వనస్థలిపురం, బైరమల్గూడ- ఇబ్రహీంపట్నం సెక్షన్ల పరిధిలో ఫేక్ ఎనైసీల దం దా యథేచ్చగా జరుగుతున్నట్లు సమాచారం. కాం ట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి క్షేత్రస్థాయి ఇంజనీర్లు పరోక్షంగా అక్రమార్కులకు సహకరిస్తు న్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Ticket Rates: టికెట్ రేట్లు పెంచడంపై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే?.. నిర్మాతలు సేఫ్..

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే