Ticket Rates: టికెట్ రేట్లు పెంచడంపై హైకోర్టు ఏం చెప్పిందంటే?..
ticket-rates-hike
ఎంటర్‌టైన్‌మెంట్

Ticket Rates: టికెట్ రేట్లు పెంచడంపై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే?.. నిర్మాతలు సేఫ్..

Ticket Rates: సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘ది రాజాసాబ్’ సందడి చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాల టికెట్లు విషయం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘ది రాజాసాబ్’ నిర్మాతలకు కొంత ఊరటనిస్తుంది.  తెలంగాణలో టికెట్ రేట్లు పెంపు విషయం ఇప్పటికే కోర్టులో ఉన్న విషయం తెలిసిందే.  నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ‘ఓజీ’, ‘పుష్ప-2’, ‘గేమ్ ఛేంజర్’కు మాత్రమే వర్తిస్తాయన్న డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వమే తీసుకోనుంది. ఇప్పటికే టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోరుతూ ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘రాజాసాబ్’ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఇషాన్ సక్సేనా, సాహు గారపాటిలు హైకోర్టులో అప్పీలు చేశారు. అయితే తుది నిర్ణంయం మాత్రం సర్కారు వద్ద మాత్రమే ఉంది. దీని గురించి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. ఇదే టికెట్లు విషయమై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెంచిన ఫలం అందరికీ అందాలని, అప్పుడే టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు హైకోర్టు ఇలా చెప్పడంతే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

Read also-Anvesh YouTuber: ‘ఏయ్ జూడ్’ దెబ్బకు భయపడి రూటు మార్చిన అన్వేష్.. ఏం చేశాడంటే?

ఈ సంక్రాంతికి పాన్ ఇండియా రెబర్ సాబ్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ రాబోతుంది.  ఈ సినిమాను నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ దాదాపు రూ.400 కోట్లు తో నిర్మించారు. అసలే పాన్ ఇండియా స్టార్ అందులోనూ హై బడ్జెట్ కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లను సింగిల్ థియేటర్లలో రూ.800 రూ మల్టీఫెక్స్ థియేటర్లలో రూ.1000 పెంచుకునేలా నిర్మాతలు ప్రభుత్వాన్ని అనుమని అడిగారు.

Read also-Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

ఈ సంక్రాంతి బరిలోకి రాబోతున్న మరో మెగా బడ్జెట్ మెగాస్టార్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చాట్ బాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమా కూడా దాదాపు రూ.100 కోట్ల నిర్మాణ విలువలు కలిగి ఉంది. అయితే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకనేందుకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్లీ ఫ్లెక్సులు రెండింటిలోనూ.. టికెట్ రేట్లు రూ.600 వరకూ పెంచుకునేందుకు అనుమతి కోరారు. అయితే దీనిపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఈ రెండు సినిమాల టికెట్ రేట్లు పెంచతే నిర్మాత కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉంది.

Just In

01

Seethakka Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కారణం ఏంటంటే?

Naga Vamsi: మనమీద ఎక్కేవాళ్లకి ఈ సినిమా సమాధానమివ్వాలి..

Ponguleti Srinivasa: మంత్రి పొంగులేటి నివాసంలో సంక్రాంతి శోభ.. ఘుమఘుమలాడిస్తున్న వంటకాలు

Khammam News: నా భర్తకు అక్రమ సంబంధం ఉంది.. ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించిన ఖమ్మం మహిళ

Vishnu Vinyasam: ‘దేఖో విష్ణు విన్యాసం’.. సాంగ్ ఇలా ఉందేంటి?