Anvesh YouTuber: ‘ఏయ్ జూడ్’ దెబ్బకు రూటు మార్చిన అన్వేష్..
anvesh-aye-jude
ఎంటర్‌టైన్‌మెంట్

Anvesh YouTuber: ‘ఏయ్ జూడ్’ దెబ్బకు భయపడి రూటు మార్చిన అన్వేష్.. ఏం చేశాడంటే?

Anvesh YouTuber: యూట్యూబర్ అన్వేష్ హీరోయిన్ల దుస్తులపై చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. యూట్యూబ్ వ్యూస్ కోసం అన్వేష్ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు అయిన కరికపాటి నరసింహ మూర్తిని, యాక్టర్ శివాజీ ని అసభ్య పదజాలంతో తీవ్రంగా తిట్టిపోశారు. దీంతో అన్వేష్ ప్రవర్తనపై చిరాకు పుట్టిన నెటిజన్లు అన్వేష్ వీడియోలు చూడటం మానేశారు. అంతే కాకుండా చానల్ ను అన్ సబ్‌స్కైబ్ కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఓ ఉధ్యమంగా సాగుతోంది. అన్వేష్ అసభ్య పదజాలంపై స్పందించిన ఏయ్ జూడ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీనిపై అన్వేష్ స్పందిస్తూ.. ఏయ్ జూడ్ గురించి అన్ని విషయాలు బయట పెడతానుంటూ మీడియా ముఖంగా కూడా సవాలు చేశాడు. దీంతో మరో సారి ఏయ్ జూడ్ ప్రత్యక్షంగా స్పందించారు. రా చూసుకుందాం అంటూ సవాలు కూడా విసిరాడు. దీనికి సంబంధించి రెండు వీడియోలు కూడా విడుదల చేశాడు. దీంతో అన్వేష సైలెంట్ అయిపోయాడు. తాజాగా పెట్టిన వీడియోలో ఏయ్ జూడ్ ను పొగుడుతూ వీడియో చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు ఏయ్ జూడ్ దెబ్బకు అన్వేష్ భయపడ్డాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో పెట్టిన గంటల్లోనే నువ్వు అడిగిన ప్రతి దానికీ స్పందిస్తా అన్న ఏయ్ జూడ్ ఇప్పటి వరకూ వీడియో గురించి ఏమీ మాట్లాడలేదు. దీంతో ఇద్దరూ కలిసిపోయారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా మళ్లీ పాత పందా ప్రకారం బెట్టింగ్ యాప్స్ అంటూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read also-Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

ఏయ్ జూడ్ వార్నింగ్..

ఇటీవల ఏయ్ జూడ్ అన్వేష్ గురించి ప్రత్యేక వీడియో ఒకటి చేశారు. ఈ వీడియోలో ఏయ్ జూడ్ అన్వేష్ గురించి ఏం అన్నారంటే.. అన్వేష్ కాసుకో ఇప్పటి వరకూ నేను నీకు చెప్పాల్సింది చెప్పా, నువ్వు నా గురించి మట్లాడావు సరే, నా కుటుంబం గురించి నీకు అనవసరం అయినా వచ్చావు. నువ్వు నాపై పెట్టిన ప్రతి గంటకూ నేను వీడియో పెడతా ఇక నీకు మూడిందే. ఇక నా తండ్రి గురించి తీశావు అది మా వ్యక్తిగతం, మా మధ్య మనస్పర్దలు మాత్రమే ఉన్నాయి. మా తమ్ముడు అంటున్నావు నువ్వు చూశావా? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అసలు పద్నాలు గేళ్ల పిల్ల జీవితంతో ఆడుకున్నది నువ్వు, రా చూసుకుందాం. వచ్చే ముందు నీ దగ్గర ఉన్న ఆధారాలతో రా ఏధో గాల్లో చెప్పినట్లు చేయకు. నోటికి ఏది వస్తే అది అడ్డంగా వాగటానకి ఎవరూ సిద్దంగా లేరు. నీ గురించి ఎన్ని చర్చలు జరుగుతున్నాయో ముందు తెలుసుకో. ఒక్క రోజు ఫోక స్ చేస్తేనే నీ గురించి చాలా తెలిశాయి.. ఇంకా చెయ్యమంటావా దానీకి రెడీనే.. రా చూసుకుందాం. అంటూ సవాలు విసిరాడు. అయితే అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి మారి. ఇప్పటికే అన్వేష్ ఇదంతా కావాలని చేస్తున్నాడంటూ కొన్ని ఆడియో మెసేజులు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతున్నాయి.

Read also-Samantha Movie: సమంత ‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Just In

01

Seethakka Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కారణం ఏంటంటే?

Naga Vamsi: మనమీద ఎక్కేవాళ్లకి ఈ సినిమా సమాధానమివ్వాలి..

Ponguleti Srinivasa: మంత్రి పొంగులేటి నివాసంలో సంక్రాంతి శోభ.. ఘుమఘుమలాడిస్తున్న వంటకాలు

Khammam News: నా భర్తకు అక్రమ సంబంధం ఉంది.. ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించిన ఖమ్మం మహిళ

Vishnu Vinyasam: ‘దేఖో విష్ణు విన్యాసం’.. సాంగ్ ఇలా ఉందేంటి?