Samantha Movie: పెళ్లి తర్వాత సమంత రూత్ ప్రభు మరో ఫ్రెష్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన సొంత నిర్మాణంలో ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం అనే సినిమా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ విడుదలకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో టీజర్ ట్రైలర్ ను జనవరి 9, 2026 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సమంత కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె కేవలం నటిగానే కాకుండా, తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures) పతాకంపై స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Read also-Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?
ఈ సినిమా సమంత ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న రెండో ప్రాజెక్ట్. మొదటిది ‘శుభం’. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సమంత ఆర్టీసీ బస్సులో యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమంతతో పాటు ప్రముఖ దర్శకులు రాజ్ నిడిమోరు కూడా భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2026 చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సమంత నిర్మాణంలో వచ్చిన మొదటి సినిమా శుభం మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ అనుకుంటే ప్రేక్షకుల్లో కుతూహలం పెంచేందుకు టీజర్, ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. దీంతో ముందునుంచే ఎంతో స్ట్రేటజిక్ గా ముందుకు వెళుతుంది ఈ సినిమా. మరి ఈ టీజర్ ట్రైలర్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంత రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్న తర్వా రాబోతున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.
Read also-Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?
Samantha’s new film poster is out! She returns with Ma Inti Bangaram, her third collaboration with director Nandini Reddy. The trailer will be released on January 9 at 10:00 AM. pic.twitter.com/robgjGh1l1
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) January 7, 2026

