Warangal Crime: వరంగల్లో జిల్లాలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, భార్య కత్తితో భర్తపై దాడిచేయడానికి ప్రయత్నించింది. దీంతో భయపడిపోయిన భర్త తనను రక్షించుకోవడానికి 100 కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: Drug Peddlers: డ్రగ్ పెడ్లర్ల నయా ఎత్తుగడ.. మైనర్లతో ఇలాంటి పనులా?
పూర్తివివరాల్లోకి వెలితే..
వరంగల్(Warangal) జిల్లాలో కత్తితో ఓ వివాహిత హల్‌చల్ చేసింది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం(Extramarital affair) పెట్టుకున్నాడనే కోపంతో కత్తి(Knife)తో భర్తపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో భయపడిపోయిన భర్త శ్రీకాంత్(Srikanth) భార్య జ్యోత్స్న(Jyotsna) నుంచి తప్పించుకునేందుకు భర్త శ్రీకాంత్ అక్కడే ఓ షాపులో దాక్కున్నాడు. భయంతో తన ప్రణాలను రక్షించుకొవడానికి శ్రీకాంత్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులుకు ఫిర్యాదు చేసాడు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం జ్యోత్స్న చేతిలో ఉన్న కత్తిని పోలీసులు లాక్కున్నారు. భార్య భర్తల మద్య జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అక్కడి జిల్లాలో కలకలం రేపింది. తన భర్త ఓకవేల దొరికి ఉంటే తన ప్రాణాలు పోయేవని అక్కడి ప్రజలు గుసగుసలాడుకుటున్నారు. వరంగల్లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. భార్య జ్వోత్స్న పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కత్తితో వివాహిత హల్‌చల్
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నం
భార్య జ్యోత్స్న నుంచి తప్పించుకునేందుకు ఓ షాపులో దాక్కున్న భర్త శ్రీకాంత్
డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన శ్రీకాంత్
ఘటనా స్థలానికి చేరుకుని జ్యోత్స్న చేతి నుంచి కత్తి లాక్కున్న పోలీసులు… pic.twitter.com/3K5eRBgIZo
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2026

