Congress Party: కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ అంశం మరోసారి చర్చ
Congress Party ( image credit: swetcha reporter)
Political News

Congress Party: కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ అంశం మరోసారి చర్చ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలో పక్కా వ్యూహం!

Congress Party:  కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. సర్పంచ్ ఎన్నికల సమయంలో వీరి కారణంగా ఓటు బ్యాంకు చీలింది. ఫలితంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్‌కు ప్లస్ అయింది. ఇదే భయం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులలో కనిపిస్తున్నది. అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని పార్టీ క్షేత్రస్థాయి వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్‌గా పోటీ చేసిన వాళ్లను వెంటనే సస్పెండ్ చేయాల్సిందేనని మండల పార్టీ అధ్యక్షులు కోరుతున్నారు. ఆయా లీడర్లపై ఎలాంటి చర్యలు లేకుండా వదిలేస్తే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలే ప్రమాదం ఉంటుందని వివరిస్తున్నారు. కోవర్ట్ డ్రైవ్‌లు జరిగే ఛాన్స్ ఉన్నదని చెబుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఆయా లీడర్లు పార్టీలోనే కంటిన్యూ అవుతున్నట్లు ప్రజలు భావిస్తారని, తద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కొంత మేరకు ఓట్ బ్యాంక్ ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంటుందని హైకమాండ్‌కు వివరిస్తున్నారు. సస్పెండ్ చేస్తే, ప్రజలందరికీ వారంతా హస్తం పార్టీలో లేరనే సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు. దీని ద్వారా బీఆర్ఎస్ ఓట్ షేర్ కూడా పెరగకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని మెజార్టీ మండల అధ్యక్షులు పార్టీని కోరినట్లు తెలుస్తున్నది.

Also Read: Congress Party: విశ్వనగర నిర్మాణంలో కాంగ్రెస్ పాత్రే కీలకం.. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాలకు టీపీసీసీ చెక్!

సీఎం కూడా సీరియస్

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మండల పార్టీ మద్దతును కాదని, పార్టీ సపోర్టుతో నిలబడిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రెబల్స్ పోటీ చేశారు. ఎన్నికల సమయంలో మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు పోటీ నుంచి తప్పుకోవాలని కోరినా పట్టించుకోలేదు. పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మాటను కూడా ఆయా రెబల్స్ లెక్క చేయలేదు. దీంతో కొన్ని పంచాయతీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎలా అంటూ ఫైరయ్యారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రెబల్స్ వివరాలు తీసుకొని, చర్యలు తీసుకోవాలని పార్టీకి సూచించారు. పీసీసీ చీఫ్​ కూడా జిల్లా అధ్యక్షుల నుంచి రెబల్స్ వివరాలు తెప్పించుకున్నట్లు తెలిసింది. కానీ, ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని మండల అధ్యక్షులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి నష్టం జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలస్యం చేస్తే ఆయా నేతలు కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా నష్టం చేకూర్చే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. కాంగ్రెస్ ఓట్లు చీలితే, ఆ లబ్ధి నేరుగా కారు గుర్తుకే చేరుతుందని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు.

గులాబీకి పాజిటివ్‌గా రెబల్స్

కాంగ్రెస్‌లో (Congress Party) ఉంటూ సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్‌గా పోటీ చేసిన లీడర్లు గులాబీ పార్టీకి పాజిటివ్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ సపోర్ట్ ఉంటుందని కొందరు హామీలు కూడా ఇస్తున్నారని సమాచారం. తమకు పార్టీ టికెట్ ఇవ్వలేనందున ప్రతీకారం తీర్చుకుంటామని కొందరు రెబల్స్ మండల అధ్యక్షులకు వార్నింగ్ కూడా ఇస్తున్నారని తెలిసింది. ఆయా రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినా పార్టీ మాట వినడం లేదని, చర్యలు తీసుకోవాల్సిందేనని మండల అధ్యక్షులు సూచిస్తున్నారు. రెబల్స్ అంశంలో హైకమాండ్ జోక్యం చేసుకొని త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రెబల్స్‌కు చెక్ పెట్టేలా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.

Also Read: Congress Party: కాంగ్రెస్‌లో ప్లెక్సీల లొల్లి.. నేతల పరువు తీసిన క్యాడర్.. వినూత్న రీతిలో నిరసన

Just In

01

Ponnam Prabhakar: రాహుల్ గాంధీని విమర్శిస్తే తాట తీస్తాం.. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్!

Rangareddy District: ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు విద్యార్థులు స్పాట్ డెడ్

Keesara Police: కీసరలో కత్తుల కలకలం.. దొడ్ల మిల్క్ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి చేసిన పాల వ్యాపారి!.

Megastar Song: మెగాస్టార్ ‘హుక్ స్టెప్’ ఇరగదీశాడుగా.. ఫుల్ లిరికల్ వీడియో ఎలా ఉందంటే?

KTR: కాంగ్రెస్ హామీలు అమలెప్పుడు? సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్!