Nizamabad News: నిజామాబాద్ నగరంలో రెచ్చిపోయిన పాత నేరస్తుడు వినయ్ గౌడ్(Vinay Goud) దాడి ఘటనలో పోలీసులు స్పీడు పెంచారు. పాత కక్షలతో శ్రీరామ్(Sriram) అనే వ్యక్తి పై దాడి చేసిన వినయ్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొదట ఘుమఘుమలు రెస్టారెంట్(Ghumaghumalu Restaurant) వద్ద దాడి చేసిన తరువాత అంతటితో ఆగకుండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి ఈడ్చుకెళ్లి మరోసారి దాడి చేసినట్లు బాధితుడు శ్రీరామ్ మనీష్ తెలిపాడు.
Also Read: Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..
కేసు నమోదు..
ఈనెల 9 జరిగిన ఘటన పై ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఫిర్యాదు చేసినా నాలుగవ టౌన్ ఎస్ఐ(SI) పట్టించుకోవటం లేదని డిజిపి, సిఎం రేవంత్ రెడ్డికి బాధితుడి X లో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీపీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుగుతుంది అని నాలుగవ టౌన్ పోలీసులు బాధితుడు శ్రీరామ్ మనీష్ X లో పెట్టిన ట్వీట్ కు రీ ట్వీట్ చేసి పోలీసులు. దీంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశం అయింది.
Also Read: Crime News: కరీంనగర్ జిల్లాలో దారుణం.. కొడుకు కూతురును చంపేందుకు ప్రయత్నించిన తండ్రి..!
