Ex MLA Shakeel Aamir: ఆ మాజీ ఎమ్మెల్యే మౌనం వీడారు.. కేసులకు భయపడి సైలెంట్ ఉన్నారని అందరూ అనుకుంటే.. ఆయన మాత్రం అబ్బే అదేం లేదే అంటూ… సైలెన్స్ కు కారణం చెప్పేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆయన.. ఇటీవలే నియోజకవర్గంలో అడుగుపెట్టారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని ప్రకటించారు. అవినీతి ఆరోపణలపైనా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ మౌనం వీడటం వెనుక వ్యూహాం ఉందా.. సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా.. ఇన్నాళ్లు కేసులకు భయపడే దుబాయ్ లో ఉండిపోయారా?
ఆ గులాబీ మాజీ ఎమ్మెల్యే.. మళ్లీ యాక్టివ్ అయినట్లేనా? నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగుపెట్టారట. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. నియోజకవర్గానికి ముఖం చాటేశారట. సుమారు 16 నెలల పాటు దుబాయ్ లోనే ఉండిపోయారట.
వివిధ కేసుల్లో ఆయన పై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఆయన దుబాయ్ లోనే ఉండిపోయారు. ఇటీవల షకీల్ తల్లి అనారోగ్యంతో మృతిచెందగా, అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో షకీల్ ను అదుపులో తీసుకుని విచారించి వదిలేశారట. దీంతో ఆయన బోధన్ లో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, ఆయన మాత్రం బోధన్, హైదరాబాద్ లో ప్రజలు, నాయకులకు అందుబాటులో ఉన్నారట.
Also read: Gadwal Protest: పచ్చని పల్లెల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ.. సమిష్టిగా వ్యతిరేకిస్తున్న రైతులు!
పైగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసి మౌనం వీడారట. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, పోలీసు కేసుల క్లారిటీ ఇచ్చారట. తనను తన కుమారున్ని అక్రమంగా కేసుల్లో ఇరికించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ.. సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారట. కేసులకు భయపడి దుబాయ్ కి వెళ్లలేదని, అనారోగ్య సమస్యలతో దుబాయ్ లో ఉండాల్సి వచ్చిందని క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారట షకీల్. పైగా కక్ష సాధించడానికి నాతో పాటు నా కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారంటూ.. సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారట ఆ మాజీ ఎమ్మెల్యే.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. షకీల్ దుబాయ్ కి వెళ్లి అక్కడే ఉండిపోయారట. అదే సమయంలో కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ పై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు కాగా.. కుమారున్ని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్ పైనా కేసు పెట్టారట పోలీసులు. కేసుల భయంతో దుబాయ్ లోనే ఉండిపోయారని ప్రచారం జరిగిందట. అంతకు ముందు ప్రభుత్వం ధాన్యం మాయం చేశారనే ఆరోపణలపై, పౌరసరఫరా శాఖ సైతం షకీల్ పై పలు కేసులు పెట్టింది.
ఇలా పోలీస్ కేసుల్లో ఇరుక్కున్న షకీల్.. నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండిపోయారట. పార్టీ కార్యక్రమాలకు సైతం బైబై చెప్పారట. నియోజకవర్గ బాధ్యతలను ఆయన భార్య చూశారట. ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ సైతం తమకు దిక్కెవరంటూ.. పార్టీ పెద్దలను కలిశారట. కొత్త ఇంచార్జీని నియామకం చేస్తామంటూ పార్టీ పెద్దలు సైతం సూచ ప్రాయంగా చెప్పారట. ఇంచార్జీ మార్పు తథ్యం అనే సమయంలో.. నేనున్నానంటూ షకీల్ మళ్లీ వచ్చేశారట. తాను అవినీతికి పాల్పడినట్లు దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారట.
Also read: AP Digital Governance: ప్రతిపక్షాలను కాదు ఉగ్రవాదాన్ని అణచివేయండి.. షర్మిల ఫైర్!
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని, తాను అందుబాటులో ఉంటానని చెప్పాకొచ్చారట షకీల్. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానంటూ భరోసా ఇచ్చారట. మౌనం వీడటం వెనుక .. పెద్ద వ్యూహాం ఉందని చెబుతున్నారట ఆయన అనుచరులు. స్దానికంగా అందుబాటులో ఉండి, రానున్న స్దానిక సంస్ధల ఎన్నికలతో పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారట. పార్టీ పెద్దలు సైతం మేమున్నామనే భరోసా ఇచ్చారట. దీంతో ఆయన బోధన్ కేంద్రంగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారనే ప్రచారం జరుగుతుందట.
షకీల్ పై నమోదైన కేసులను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారట. ఒక వేళ అరెస్టు చేసినా ప్రజల్లో సానుభూతి వస్తుందని భావిస్తున్నారట. అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారంటూ పదేపదే ప్రచారం చేస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే వ్యూహాం ఫలిస్తుందా, సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా.. అనేది తేలాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.