Jupally Krishna Rao ( IMAGE credit; swetcha reporter)
తెలంగాణ

Jupally Krishna Rao: ఈ సారి అంగరంగ వైభవంగా.. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు

Jupally Krishna Rao: సంప్ర‌దాయం ఆధునిక‌త‌ల మేళ‌వింపుగా, సంస్కృతి, ప్రకృతి, ప‌ర్యాట‌కంతో మమేకం అయ్యేలా, స‌క‌ల జ‌నుల స‌మ్మేళ‌నంతో అంగ‌రంగ వైభ‌వంగా బ‌తుక‌మ్మ సంబ‌రాలను నిర్వ‌హించేందుకు స‌న్న‌హాలు చేస్తున్న‌ట్లు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. బేగంపేట‌లోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామాలతో పాటు హైదరాబాద్‌లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

నిర్వ‌హణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని దిశానిర్ధేశం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలు, ప‌ర్యాట‌క‌, చారిత్ర‌క ప్రాంతాల‌ను ముస్తాబు చేయాల‌ని, అక్క‌డ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని దిశానిర్ధేశం చేశారు. బతుక‌మ్మ‌పై ప్ర‌త్యేక గీతాలు, మ‌న సంస్కృతి, సాంప్ర‌దాయ‌లు ఉట్టిప‌డేలా, ప్ర‌కృతి, ప‌ర్యాట‌కం, పర్యావ‌ర‌ణం థీమ్ రూప‌క‌ల్ప‌న చేయాల‌ని, వీటిని ప్ర‌తీ ఒక్క‌రూ కాల‌ర్ ట్యూన్స్, సోష‌ల్ మీడియా స్టేట‌స్ లుగా పెట్టుకోవాల‌ని కోరారు. ఉత్స‌వాల అనంత‌రం పూలు, ఇత‌ర సామాగ్రిని వృదాగా పార‌బోయ‌కుండా వాటితో ప‌ర్యావ‌ర‌ణహిత వ‌స్తువులు త‌యారు చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

 Also Read: ED Summons: యువరాజ్, ఉతప్ప, సోనూ సూద్‌లకు ఈడీ నోటీసులు.. వ్యవహారం ఏమిటంటే?

ఈ నెల 21న వరంగల్‌లోని చారిత్రాత్మక

ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న వేడుకలను మరోసారి లోకానికి చాటి చెప్పేందుకు సన్నాహాలు చేయాల‌న్నారు. విస్తృతంగా ప్ర‌చారం చేప‌ట్టాల‌ని కోరారు. ఈ నెల 21న వరంగల్‌లోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి వద్ద బతుక‌మ్మ ప్రారంభోత్స‌వాన్ని దిగ్విజ‌యంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కొన్ని ఎంపిక చేసిన జంక్షన్లతో పాటు టూరిజం హోటళ్లు, రైల్వే, బస్‌ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల్లోనూ సాంప్ర‌దాయ‌ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాల‌న్నారు. విద్యార్థులంతా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేలా క‌ళాశాల‌, యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్లు పండుగ దిగ్విజయంగా జరిగేలా కృషి చేయాల‌ని సూచించారు. సాంస్కృతిక క‌ళాసార‌ధులు సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని చెప్పారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీ గ్యాల‌రీ డెరెక్ట‌ర్ ల‌క్ష్మి, తదిత‌రులు పాల్గొన్నారు.

27న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ మహిళల బైక్‌ ర్యాలీ

ఈ నెల 21న వరంగల్ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభోత్సవం, హైదరాబాద్ శివారులో మొక్క‌లు నాట‌డం, 22న హైదరాబాద్ శిల్పరామం, మహబూబ్‌నగర్ లోని పిల్లలమర్రి, 23న నల్లగొండలోని నాగార్జున సాగర్ లోని బుద్ధవనం, 24న భూపాలపల్లి లోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్, 25న భద్రాచలం ఆలయం, గద్వాలలోని జోగులాంబ అలంపూర్, 25 నుంచి 29 వరకు హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, బతుకమ్మ ఆర్ట్ క్యాంప్, 26న నిజామాబాద్ అలీ సాగర్ రిజర్వాయర్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని సైకిల్ ర్యాలీ, 27న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ మహిళల బైక్‌ ర్యాలీ, ఐటి కారిడార్, బతుకమ్మ కార్నివల్ , 28న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 10వేల మంది మహిళలతో 50 అడుగుల బతుకమ్మ, గిన్నీస్ వరల్డ్ రికార్డ్, 29న పీపుల్స్ ప్లాజా, ఉత్త‌మ బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్, రెసిడెంట్ వెల్పేర్ అసోసిమేష‌న్స్, హైదరాబాద్ సాప్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్, హైదరాబాద్ – రంగారెడ్డి లో బతుకమ్మ పోటీలు, 30న ట్యాంక్‌బండ్, గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా – జ‌ప‌నీయుల‌ ప్రదర్శన, సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షో.

 Also Read: Vande Bharat: హైదరాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు.. ఏయే నగరాలకంటే?

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?