Suicide Attempt: సెల్ ఫోన్ కోసం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సంచనం రేపింది. దీంతో కొందరు 100 ఫోన్ కాల్ తో చేయగా వెంటనే స్పందించిన పోలీసులు ఓ ప్రాణాన్ని కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. తన స్నేహితుడు ఇంట్లో నుంచి రూ.18 వేల విలువ చేసే వీఓ కంపెనీకి చెందిన ఫోన్ ఎత్తుకెళ్లాడని మనస్తాపం చెందిన అందోలు మండలం సంగుపెట్ గ్రామానికి చెందిన కృష్ణ(Krishna) అనే యువకుడు ఇంట్లోనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గ్రామస్తుడు 100కు ఫోన్ కాల్ చేయడంతో జోగిపేట పోలీసు కానిస్టేబుల్లు శ్రీకాంత్(Srikanth), అరవింద్(Aravind) లు వెంటనే గ్రామానికి వెళ్లి చీరతో దూలానికి కట్టి ఉరి వేసుకుంటుండగా అడ్డుకొని స్టేషన్ కు తరలించారు.
Also Read: Aryan Controversy: ఆర్యన్ ఖాన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన స్నేహితుడు జైద్ ఖాన్.. ఏం జరిగింది అంటే?
బలవంతంగా బయటకు పంపి..
భార్య పిల్లలను బలవంతంగా బయటకు వెల్లగొట్టి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్లు కానిస్టేబుల్ శ్రీకాంత్ తెలిపారు. తన స్నేహితుడు సుధాకర్(Sudhakar) తన ఫోన్ దొంగిలించినట్లు కృష్ణ తెలపడంతో పోలీసులు అతడిని పట్టుకొని ఫోన్ ను రికవరీ చేశారు. 5 నిముషాలు ఆలస్యమైనా ఉరి వేసుకునేవాడని తెలిపారు. ప్రాణాపాయం నుంచి కృష్ణను జోగిపేట పోలీసులు సకాలంలో స్పందించి కాపాడినందుకు స్థానికులు అభినందించారు.
Also Read: Datta Jayanti: సంగారెడ్డి జిల్లాలో నేత్రపర్వంగా… ఆదిదంపతుల కళ్యాణం

