Inspire Science Fair: స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ కార్యక్రమం శుక్రవారం ముగిసినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగేష్ అదనపు కలెక్టర్ అదనపు ఎస్పీ మహేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని వారి తరగతి గదులలో బోధిస్తున్నటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని వంట పట్టించుకోని బయటి ప్రపంచాన్ని ఆ దృక్పథంతో గమనించి, వారు నేర్చుకున్న శాస్త్రీయ అంశాలను నిజ జీవితానికి అనవయించుకొని, వినూత్నంగా ఆలోచించి కొత్త కొత్త ఆవిష్కరణలకు బీజం వెయ్యాలని సూచించారు.
విజేతలందరికీ..
ఈసారి విజేతలుగా నిలువని విద్యార్థులందరూ వచ్చే సంవత్సరం ఇదే కార్యక్రమానికి మరింత మెరుగుగా ప్రాజెక్టు తీసుకొని రావాలని, వచ్చేసారి విజేతలుగా నిలవాలి అని అన్నారు. విజేతలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు పాల్గొన్న విద్యార్థులందరికీ ఆశీస్సులు అందించారు. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు కృషిచేసిన కార్యాలయ సిబ్బందిని వివిధ కమిటీల కన్వీనర్లను కో కన్వీనర్లను మరియు ఉపాధ్యాయ సంఘం బాధ్యులను ఆతిథ్యం ఇచ్చినందుకు వెస్లీ ఉన్నత పాఠశాల సిబ్బందిని యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
Also Read: iBomma Ravi: ‘ఐ బొమ్మ’ రవి గురించి ‘అఖండ 2’ నిర్మాతలు ఏం అన్నారంటే?.. ఇది ఊహించి ఉండరు..
సర్టిఫికెట్ మరియు శీల్డులు
ఈ కార్యక్రమం ముగింపు సమావేశంలో మొత్తం 50 మంది విజేతలకు ముఖ్య అతిధి సర్టిఫికెట్ మరియు శీల్డులు అందించారు. ఇందులో సైన్స్ ఫెయిర్ 7 సబ్ థీమ్స్ లో జూనియర్, సీనియర్ విభాగాల్లో మొదటి రెండో మూడవ బహుమతులు మరియు ఇన్స్పైర్ లో 5 రాష్ట్ర స్థాయి ఎంపికలు, సెమినార్ విభాగం లో మొదటి, రెండెవ మూడవ, TLM తయారీలో మొదటి, రెండవ బహుమతులు ఉన్నాయి. పాల్గొన్న అందరికి ( విద్యార్థులు, గైడ్ టీచర్లు ) పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందచేయ్యటం జరిగింది. మొదటి స్థానం పొందిన విజేతలు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో సీఈఓ జిల్లా పరిషత్ ఎల్లయ్య డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
Also Read: Drainage Water: రోడ్డు పైకి ఇష్టా రాజ్యంగా అపార్ట్మెంట్ డ్రైనేజీ నీళ్లు.. అవస్థలో వాహనదారులు

