Drainage Water: గుండ్ల పోచంపల్లి సర్కిల్ జిహెచ్ఎంసి(GHMC) పరిధిలోని కండ్లకోయ(Kandlakoya) లో డ్రైనేజ్ నీరు ఏరులై పారుతుంది. కండ్లకోయలోని గోల్డెన్ కాజల్ అపార్ట్మెంట్(Golden Kajal Apartment) నుండి డ్రైనేజ్ వాటర్ బయటకు వస్తూ రోడ్డుపై వరదల పారుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేసినప్పుడు డ్రైనేజ్ వాటర్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గోల్డెన్ కాజల్ అపార్ట్మెంట్ వారు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే అపార్ట్మెంట్ నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిరంతరం రోడ్డుపై..
డ్రైనేజ్ వాటర్ బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అపార్ట్మెంట్ వారు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే డ్రైనేజీ నీటిని బయటకు వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అపార్ట్మెంట్ నుండి బయటకు వస్తున్న మురికి నీరు రోడ్డుపై ఏరులై పారుతుండడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ డ్రైనేజీ వాటర్ నిరంతరం రోడ్డుపై ప్రవహిస్తుండడంతో రోడ్డు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజ్ నీరు రోడ్లపై ఏరులై పారుతుండడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని, ఈ విషయంలో జిహెచ్ఎంసి(GHMC) అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Bigg Boss 9 Telugu: భరణి, కళ్యాణ్ మధ్య బిగ్ ఫైట్.. బిత్తరపోయిన హౌస్.. ఎంత పనిచేశావ్ బిగ్ బాస్!

