Municipal Elections 2026: పదిహేను రోజుల ముందే లీకులు
జోగిపేట మున్సిపాలిటీలో ఆశావాహులకు శాపం
అసలైన అర్హులకు అన్యాయం
జోగిపేట,స్వేచ్ఛ: మునిసిపల్ ఎన్నికలకు (Municipal Elections 2026) ప్రకటించిన రిజర్వేషన్లపై పలు ప్రాంతాల్లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. సామాజిక సమానత్వం పేరుతో చేపడుతున్న ఈ విధానం స్థానిక ప్రజాస్వామ్యానికి మేలు చేయడం కన్నా కొత్త వివాదాలకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోలు-జోగిపేట మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో ప్రకటించిన రిజర్వేషన్లలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారులు పార్టీ నాయకుల ఒత్తిడిలతో వారిని సంతృప్తి పరిచే విధంగా రిజర్వేషన్లను ప్రకటించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వార్డుల రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఊపందుకున్నాయి.
అనేక చోట్ల స్థానిక పరిస్థితులు, జనాభా నిష్పత్తులు, సామాజిక వాస్తవాలు పట్టించుకోకుండా రిజర్వేషన్లు ఖరారు చేశారని స్థానిక నేతలు, ప్రజలు మండిపడుతున్నారు. కొన్ని వార్డుల్లో అర్హులైన సామాజిక వర్గాలకు అవకాశం దక్కకపోగా, మరికొన్ని చోట్ల బలవంతంగా రిజర్వ్ చేయడం వల్ల ప్రజాప్రతినిధుల ఎంపికపై ప్రభావం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పోటీ చేయాలనుకున్న ఆశావహులు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు, రిజర్వేషన్ల మార్పులు-చేర్పులు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను సమగ్రంగా సమీక్షించాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
Read Also- Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులకు.. యువ ఐపీఎస్‌లతో చెక్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!
రిజర్వేషన్లు ముందే లీకు!
జోగిపేటలోని వార్డుల రిజర్వేషన్లు ముందుగానే లీకు కావడం మున్సిపల్ అధికారుల పనితీరును స్థానికులు తప్పుపడుతున్నారు. మున్సిపల్ అధికారులు తప్పుడు ఓటర్ల వివరాలతో రిజర్వేషన్లను తారు మారు చేసారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాను ప్రకటించక ముందే మున్సిపల్ కార్యాలయ అధికారులు రిజర్వేషన్లను నాయకులకు లీకులిచ్చారు. మున్సిపల్ పరిధిలోకి వచ్చే అందోలులో 5 వార్డుల్లో గతంలో రెండు ఎస్‌సీ వార్డులుండగా ఈ సారి ఉండవని, అన్‌రిజర్వుడ్, బీసీ మాత్రమే వస్తాయని ప్రచారం జరిగింది. అలాగే జోగిపేటలోని 17వ వార్డు ఎస్‌టీ అవుతుందని, 3,18వ వారుల్డు ఎస్‌సీ అవుతాయని చెప్పారు. అలా రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. మున్సిపల్ పరిధఙలోని 1వ వార్డును ఎవరూ ఊహించని విధంగా ఎస్‌సీలకు కెటాయించారు. అందులో కేవలం పదిలోపు మాత్రమే ఎస్‌సీలు ఉండడం విశేషం.
Read Also- Dhanush and Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర!

