Medak District SP: మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం లో ఉందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మెదక్ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 35 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ పోతే వెంటనే CEIR పోర్టల్ నంధు నమోదు చేసుకోవాలనీ వివరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి మెదక్ టౌన్లో గత కొన్ని రోజుల నుండి వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 35 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితులకు) అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నాం, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నామని అన్నారు, మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) CEIR పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ గారు వివరించారు.
ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, ఓక వేల పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యుటర్ పరిజ్ఞానం లేనియెడల ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసు అధికారిని ఈ CEIR Portal కి భాద్యతాధికారి గా నియమించడం జరిగినది అని, అతనిని పోలీసు స్టేషన్ కు వెల్లి సంప్రదించిన అతను CEIR Portal లో నిక్షిప్తం చేస్తాడు .తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు.
Also Raed: Minister Konda Surekha: గిరిజనులను ఇబ్బంది పెట్టొద్దు.. అటవీ అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం!
జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను CEIR అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బంది .విజయ్ గారు మరియు వెంకట్ గారు మరియు మహేందర్ గౌడ్ గారి మరియు మెదక్ టౌన్ Ceir పోర్టల్ బాద్యతధికారి మౌనిక లను, జిల్లా ఎస్పీ గారు అభినందించారు. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.