Medak-Collector (Image source WhatsApp)
మెదక్, లేటెస్ట్ న్యూస్

Collector Rahul Raj: బాల్యవివాహాలపై మెదక్ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Collector Rahul Raj: బాల్యవివాహాలు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు

పోషక ఆహార నియమాలను పాటించాలి
సామూహిక శ్రీమంతాలు ‌నిర్వహణ: కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: పోషణ్ అభియాన్ జాతీయ మిషన్ ఆధ్వర్యంలో  గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ‘పోషణ్ మాసం’ కార్యక్రమం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ విభాగం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Collector Rahul Raj) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంపూర్ణ ఆహారం, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ప్రకృతిలో దొరికే ఆకుకూరలు, పిండి పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు జరిపిస్తే పెళ్లికొడుకు ,తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అంగన్వాడి, ఏఎన్‌ఎంలను జైల్లో పడేస్తామని హెచ్చరించారు.

బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రసవం అయిన తర్వాత వైద్య పరంగానే కాకుండా, పోషణ పరంగా కూడా ప్రభుత్వం అన్ని విధాలా శ్రద్ద పెడుతుందని ఆయన చెప్పారు. రక్తహీనత, పోషణ లోపం లేని జిల్లాగా మెదక్‌ను తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అంగన్వాడి సెంటర్లలో ప్రతిరోజు కోడిగుడ్లు పాలు ఇస్తున్నారని, వాటి ద్వారా కడుపులో ఉన్న బిడ్డలకు పోషకాహారం అందాలని గుర్తుచేశారు. తెల్లటి అన్నం మాత్రమే తినడం వల్ల రక్తము రాదని, ప్రతి మహిళ ప్రసవాల మధ్య కనీసం మూడు సంవత్సరాల గ్యాప్ ఉండాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలోని పాలు, గుడ్లు, ఆహారం తీసుకోవాలన్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు, మహిళలు, కిషోర బాలికలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో పోషణ మాసం నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్యజీవనానికి కావాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ, మహిళలు, గర్భిణీ ల శిశువుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రాహుల్ రాజ్ వివరించారు.

Read Also- IRCTC Tour Package: భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త.. 9 రోజుల్లో 4 జ్యోతిర్లింగాల దర్శనం.. టికెట్ ధర ఎంతంటే?

రక్త హీనత సమస్యపై ఫోకస్..

గర్భిణీలకు ఇస్తున్న ఆహారాన్ని వారు మాత్రమే తినాలని, ఇతరులు వినియోగించుకోవదని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. నిర్ణీత గడువు లోగా తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నచిన్న పిల్లలను చూసుకోవడంలో అంగన్వాడీ టీచర్లు బాధ్యతాయుతంగా ఉంటారని, అందుకు వారిని అభినందించాలని మెచ్చుకున్నారు. ప్రైమరీ విద్యకి సంబందించి ఎలా బోధిస్తే పిల్లలకు సులభంగా అర్ధమవుతుందో, అలాగే అంగన్వాడీ టీచర్లు చెప్పాలన్నారు. పోషణ మాసంలో భాగంగా జరిగే కార్యక్రమాల ద్వారా గర్భిణీలకు, శిశువులకు మంచి ఆరోగ్యం పట్ల అన్ని అంశాల మీద అవగాహన పెరగాలన్నారు.

వ్యక్తిగత శుభ్రత, ఐరన్ టాబ్లెట్లు వేసుకోవడం, ఫీడింగ్ విషయంలో జాగ్రత్తల మీద అందరికి అవగాహన ఉండాలన్నారు. గర్భిణి స్థాయి నుంచి బిడ్డకు 3 సంవత్సరాలు వచ్చేవరకు ఆ మహిళను జాగ్రత్తగా చూసుకుంటేనే వారి ఆరోగ్యనికి మంచి పునాది వేసినట్టు అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో చివరగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంశా పత్రాలు కలెక్టర్ అందజేశారు. బాల్య వివాహాలు నిలిపివేయాలంటూ బ్యానర్లు ఆవిష్కరించారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమా భార్గవి, జెడ్‌పీ సీఈవో ఎల్లయ్య, అడిషనల్ డీఆర్డీవో, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని, విజయలక్ష్మి, ఎంసీహెచ్‌డీ, ఎంఈవోలు విజయనిర్మల, జయలక్ష్మి, జిల్లాలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read Also- Jagan on Balakrishna: ఎంతపెద్ద మాట సార్.. బాలకృష్ణపై జగన్ షాకింగ్ కామెంట్స్!.. కౌంటర్ ఇస్తాడా?

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?