Medak Cathedral Church: మెదక్ కేథడ్రల్ చర్చిలో వైభవంగా క్రిస్మస్
Medak-Church (Image source Swetcha)
మెదక్, లేటెస్ట్ న్యూస్

Medak Cathedral Church: మెదక్ కేథడ్రల్ చర్చిలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు

Medak Cathedral Church: దేశవిదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు

భక్తులతో పోటెత్తిన మెదక్ చర్చి
భక్తులకు శాంతి సందేశం ఇచ్చిన మెదక్ బిషప్ రూబెన్ మార్క్

మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కేథడ్రాల్ చర్చిలో (Medak Cathedral Church) ఏసు క్రీస్తు జన్మదిన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా మొదటి ఆరాధన కార్యక్రమం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైంది. ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకొని చర్చిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మెదక్ చర్చి బిషప్ రూబెన్ మార్క్ తన శాంతి సందేశాన్ని భక్తులకు అందించారు. ‘‘ఏసుక్రీస్తు రాకకై ప్రజలందరూ వారివారి గృహాలపై, ముఖ్యంగా క్రైస్తవులు నక్షత్రాన్ని గుర్తుగా పెడతారు. ఈ నక్షత్రం సినిమాలలో చూపించే సూపర్ స్టార్, జూనియర్ స్టార్ లాంటిది కాదు. ఈస్టార్ ఒక ప్రపంచానికే వెలుగునిచ్చే స్టార్’’ అని భక్తులకు ఆయన దైవసందేశం ఇచ్చారు.

అనంతరం మెదక్ చర్చి ప్రెస్ బీటర్ ఇంచార్జ్ శాంతయ్య మాట్లాడుతూ, గత సంవత్సరం డిసెంబర్ 25న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సుమారు 29 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. దానికి తగినట్టుగానే అభివృద్ధి జరిగిందని, దీనికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 4 గంటలకు మొదటి ఆరాధన సమయంలో క్రీస్తు సిలువను చర్చిలో ఊరేగించి వేదిక మీదకు తీసుకొని వచ్చారు. ఆరాధకులు అత్యంత భక్తి శ్రద్ధలతో క్రీస్తును ఆరాధించారు. చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్, లోపల అలంకరించిన విద్యుత్ కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read Also- Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు

యేసయ్యను ఆరాధిస్తూ ప్రార్థనలు చేశారు. భక్తులు బైబిల్ పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,. కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులను ఉద్దేశించి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడారు. కేక్‌ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు గంగాధర్, చంద్ర పాపాల్, రాగి అశోక్, మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మైనంపల్లి హనుమంతరావు కేక్ కట్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్ కృష్ణారెడ్డి, రాజు, లింగారెడ్డి తదితరులు ఉన్నారు.

మెదక్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మెదక్ చర్చి సంఘ కాపరులు, గెలన్, గంట సంపత్, తదితరులు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు చర్చి వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు.

ఉమ్మడి జిల్లాలో…

మెదక్ ఉమ్మడి జిల్లా లో గ్రామగ్రామాన చర్చిలలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ప్రతి చర్చికి 30 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకుని క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.

Read Also- Indo – Pak Border: డ్రగ్స్ మత్తులో.. పాక్‌లోకి వెళ్లిన యువకుడు.. అక్కడి ఆర్మీ ఏం చేసిందంటే!

Just In

01

Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. నిర్మాతకు దొరికేసిన రివ్యూయర్!

Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

Vilaya Thandavam: యాక్షన్ మోడ్‌లో కార్తీక్ రాజు.. ‘విలయ తాండవం’ లుక్ అదిరింది

Suryapet News: పిల్లర్లు తడుపుతూ కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృత్యువాత.. తీవ్ర విషాదం

Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల