Medak District: ట్రిపుల్ ఆర్ రోడ్డు కు సంబంధించి అవసరమైన భూ సేకరణకుగాను చౌటకూర్(Chautakur) మండలం శివ్వంపేట(Shivampet) గ్రామములో నోటీసులు అందజేయడానికి వెళ్లిన ఆర్ ఐ ప్రమోద్(RI Pramod), జిపిటీ ప్రవీణ్(GPT Praveen) లను రైతులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గంట సేపు నిర్బంధించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read: Danam Nagender: దానం నాగేందర్ రాజీనామా? అనర్హత కంటే ముందే చేసే యోచన!
రైతులు ఆగ్రహం
ఎకరాకు రూ.16 లక్షలు చెల్లించేందుకు నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు అధికారులు చెప్పగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరా భూమి రూ.కోటి పలుకుతుంటే రూ.16 లక్షలు ఇస్తామంటే ఒప్పుకోమని, భూమికి భూమి లేదా రూ.కోటి రూపాయలు ఇస్తేనే నోటీసులు తీసుకుంటామని రైతులు తెలుపగ అది మా ఫరిది కాదని తెలపడంతో ఆగ్రహించిన రైతులు అధికారులను బలవంతంగా పంచాయతీ కార్యాలయంలోకి లాక్కెళ్లి బంధించారు. విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనీల్ కుమార్(CI Anil Kumar) పోలీసు సిబ్బందితో శివంపేటకు చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు సీఐతో రైతులు వాగ్వాదానికి దిగారు. తాను ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సీఐ సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఎట్టి పరిస్థితుల్లోను రూ.16 లక్షలకు విలువైన భూములు ఇచ్చేది లేదని ఖరాఖండిగా రైతులు తెలిపారు.
Also Read: Tejas Fighter Crash: దుబాయి ఎయిర్ షోలో భారీ ప్రమాదం.. కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం
