Medak News: మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు
Medak News (imagecredit:swetcha)
మెదక్

Medak News: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకే పెద్దపీట

Medak News: మున్సిపల్ చైర్మన్, స్థానాలతో పాటు వార్డుల రిజర్వేషన్లు శనివారం కేటాయించడంతో మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మెదక్(Medak) ఉమ్మడి జిల్లాలో 20 మున్సిపాలిటీలకు గాను 12 చైర్మన్ స్థానాల్లో మహిళలు చైర్మన్లు కాబోతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్ జిల్లాలో4 మున్సిపాలిటీలు

మెదక్ (బీసీ మహిళ,)రామాయంపేట (జనరల్ మహిళా) నర్సాపూర్ (జనరల్ మహిళా)తూప్రాన్( జనరల్ మహిళా) కు చైర్మన్ స్థానాలు రిజర్వు అయ్యాయి.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట (బిసి జనరల్) ఇంకా మే 5 వ తేదివరకు ప్రస్తుత పాలక వర్గమే కొనసాగుతుంది. మే 5 తరువాత ఇక్కడ ఎన్నిక జరుగనుంది.గజ్వేల్( బి సి మహిళలకు )దుబ్బాక( బి సి మహిళల) హుస్నాబాద్ (ఎస్సీ జనరల్) చేర్యాల (ఎస్సీ మహిళ)

సంగారెడ్డి జిల్లా..

సంగారెడ్డి మున్సిపాలిటీ (జనరల్ మహిళా) సదాశివపేట,(జనరల్ మహిళా) జహీరాబాద్( బీసీ జనరల్) కొహీర్ (ఎస్సీ జనరల్) నారాయణఖేడ్ (అన్ రిజర్వుడు) ఆందోళ్ జోగిపేట( ఆన్ రిజర్వుడు) ఇస్నాపూర్( జనరల్ మహిళా) ఇంద్రేశం (ఎస్సీ మహిళ) జిన్నారం( బి సి జనరల్) గుమ్మడిదల( బి సి జనరల్) గడ్డి పొతారం మున్సిపాల్టీ నీ (ఎస్సీ మహిళ) కు రిజర్వు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 5 మున్సిపాల్టీ లు కొత్తగా ఏర్పాటు చేశారు.సంగారెడ్డి జిల్లాలోనే 6 కొత్త మున్సిపాల్టీలు ఏర్పడ్డాయి.మొదటి సారిగా మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులకు,ఆయా మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.

Also Read: GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకే కార్పొరేషన్ కింద నిర్వహిస్తారా? లేక మూడు ముక్కలు చేసి జరుపుతారా?

రిజర్వేషన్లతో ఆశల గల్లంతు..

చైర్మన్ స్థానాలకు మెదక్ ఉమ్మడి జిల్లాలో ఆశలు పెట్టుకున్న అనేక మంది సీనియర్ రాజకీయ నేతల ఆశలు రిజర్వేషన్ల పుణ్యమా అని ఆశలు అడియాశలు అయ్యాయి. బి సి జనరల్ సీట్( కౌన్సిలర్) స్థానాలకు పోటీ పడ్డ నాయకులకు సహితం దక్కలేదు. బి సి మహిళలకు కొన్ని చోట్ల దక్కడంతో వారు పోటీ చేయాలనుకున్న స్తానంలో వారి సతీమణులను పోరులో దింపనున్నారు. మరి కొందరు అన్ రిజర్వుడు స్తానంలో పోటీ చేయాలనుకున్న సీనియర్ నాయకుల కు రిజర్వేషన్లు అనుకూలించక పోవడంతో రాజకీయాలకే దూరం ఉండే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మెదక్, సంగారెడ్డి, గజ్వేల్, సిద్దిపేట, మున్సిపాలిటీలతో పాటు దాదాపు ఉమ్మడి జిల్లాలో రిజర్వేషన్లు అనుకూలించక సీనియర్ నేతలకు చైర్మన్లు అయ్యే అవకాశాలు చేజారాయి. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానంగా కొండన్ సురేందర్ గౌడ్, తాజా మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, అరుణార్తి వెంకట రమణ, బొజ్జ పవన్, రాగి అశోక్, మేడి మధుసూదన్ రావు, దొంతి నరేష్ గౌడ్ లు చైర్మన్ స్థానం ఆశించి ప్రచారం చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ బరిలోకి..

బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆరేళ్ల మళ్ళీ కార్జున్ గౌడ్, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, ప్రభురెడ్డి, చైర్మన్ పదవిని ఆశించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేత బట్టి జగపతి సతీమణి చైర్మన్ రేసులో ఉంన్నారు. తీర బీసీ మహిళ కావడంతో అందరి ఆశలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా వేల సంఖ్యలో ఫ్లెక్సీలు పెట్టీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన అరుణార్తి వెంకట రమణకు రిజర్వేషన్ కలిసి రాలేదు. బి సి మహిళలకు చైర్మన్ పదవి రిజర్వు కావడంతో మాజీ చైర్మన్ కొండన్ సురేందర్ గౌడ్, సతీమణి. మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సావిత్రి గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుంది. బి ఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆరేళ్ల మళ్ళీ కార్జున్ గౌడ్ సతీమణి తాజా మాజీ కౌన్సిలర్ గాయత్రీ నీ బరిలోకి దింపనుంది. ఇక్కడ చైర్మన్ స్తానాన్ని ఆశించిన చంద్రపాల్, ప్రభురెడ్డి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డిల వార్డులు రిజర్వేషన్లుతో గల్లంతయ్యాయి. ఇదే పరిస్తితి ఉమ్మడి జిల్లాలో నెలకొని ఉంది. గజ్వేల్లో బిఆర్ఎస్ పార్టీ నేత మాజీ అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. అక్కడ బీసీ మహిళకు చైర్మన్ స్థానం రిజర్వేషన్ ఖరార్ అయింది.

Also Read: BJP Group Politics: గ్రూప్ పాలిటిక్స్.. ఆ తరహా రాజకీయాలుంటే తప్పేంటి.. బీజేపీ ఎంపీల భిన్న స్వరాలు!

Just In

01

BJP Politics: కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల!.. కేంద్ర మంత్రి మద్దతిస్తే.. వ్యతిరేకిస్తున్న ఎంపీ.. విషయం ఏంటంటే?

VV Vinayak: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చూసిన మాస్ డైరెక్టర్ స్పందనిదే..

Plane Missing: ఇండోనేషియాలో విమానం మిస్సింగ్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. ప్లేన్‌లో ఎంతమంది ఉన్నారంటే

Challa Narasimha Reddy: పేదల పొట్ట కొట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది: చల్లా నరసింహారెడ్డి

CP Sajjanar: లక్కీ డ్రాల ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్‌ వార్నింగ్‌..?