DK Aruna: వికసిత్ భారత్ లక్ష్యంతో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ, మరింత మెరుగు పరుస్తూ.. విబి జీ రామ్ జీ బిల్లు(VB Jee Ram Jee Bill)ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(DK Aruna) అన్నారు. శుక్రవారం గద్వాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-GRAMG) బిల్ 2025 ను ప్రవేశపెట్టిందన్నారు. ఇది గ్రామీణ ఉపాధి విధానంలో కీలకమైన మార్పును సూచిస్తుందని అన్నారు. పాత పథకం కంటే మెరుగైన నైపుణ్య అభివృద్ధి, పారదర్శకత, మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంతో అనుసంధానించబడిందని అన్నారు. 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచిందన్నారు. కూలీలకు పని పూర్తయిన 15 రోజుల వ్యవధిలో వేతనం చెల్లించాలని, పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే నిబంధనలు కేంద్రం తీసుకువచ్చింది అని గుర్తు చేశారు.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో..
మహాత్మ జాతీయ ఉపాధి పథకం అనేది కేవలం కరువు కాలంలో ఆదుకునే పథకంగా ఉంటే, వీబీ-జీ రామ్ జీ చట్టం గ్రామీణ భారతాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళికగా అభివర్ణించారు. కొత్త చట్టం అమలులో భాగంగా పూర్తిస్థాయి డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఆధునిక సాంకేతికతను, బయోమెట్రిక్ హాజరును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ (DBT) అయ్యేలా కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని విమర్శించారు. ఉపాధి పనులను వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మహాత్మా గాంధీ చివరి పలుకులు ఈ పథకం పేరులో ఉన్నాయని అన్నారు.మహాత్మా గాంధీకి.. కాంగ్రెస్ అగ్ర నాయకతంలో ఉన్న నేతలకు ఎటువంటి బంధం లేదు అని ఇప్పుడు ఉన్న గాంధీలు మహాత్మా గాంధీ కుటుంబ సభ్యులు కాదు అని తెలిపారు. ఇంకా గాంధీ పేరు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు.గ్రామాల అభివృద్ధి జరుగుతేనే.. రాష్ట్రా అభివృద్ధి.. దేశ అభివృద్ది సాధ్యం అని అన్నారు. స్వచ్ భారత్ లో గాంధీ జీ ఫోటో ఉంటుంది అని మహాత్మా గాంధీకీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అని పేర్కొన్నారు.
Also Read: Prabhas Fan: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ వెయ్యలేదని అభిమాని చేసింది చూస్తే షాక్ అవుతారు..
ఇరిగేషన్ బ్రిడ్జి కాకుండా..
కాంగ్రెస్ ఈ పథకాన్ని రాజకీయం చేయాలనే దుర్బుద్ధితో ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా మారిన జూరాల ప్రాజెక్ట్ జూరాల ప్రాజెక్ట్ నిర్వహణ సరిగా లేక.. జూరాల ఆయుష్షు తగ్గుతుంది అని అన్నారు. జూరాల ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం బ్రిడ్జి నిర్మాణం చేయాలని, లేదంటే ప్రాజెక్ట్ కే ప్రమాదమని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అని అన్నారు. ఇరిగేషన్ బ్రిడ్జి కాకుండా ఆర్అండ్ బి ఆర్అండ్ బి బ్రిడ్జి గా దానిని మార్చారు.. దీని వల్ల జూరాల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనారు. జూరాల ప్రాజెక్టు కూలిపోయిన మాకు పట్టదు అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అవగాహన ఉండి ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా.. అవగాహన రాహిత్యంగా సలహాలు ఇస్తున్నారా అర్ధం కావడం లేదు అని అన్నారు. ఈ అంశం ఇరిగేషన్ అధికారులు, సీఎం రేవంత్ రెడ్(CM Revanth reddy)డి దృష్టికి తీసుకువెళ్లారా.. బ్రిడ్జి ఎందుకు మంజూరు అయ్యిందనేది సీఎం కి అసలు తెలుసా. లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెం దొడ్డి వెంకటేశ్వర రెడ్డి ,గద్వాల పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివారెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి ,మండల అధ్యక్షుడు శ్రీనివాసులు,తదితరులు ఉన్నారు..

