Telangana Government (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Government: తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు.. ఉత్తర్వులు జారీ!

Telangana Government: తెలంగాణలో జాయింట్ కలెక్టర్(Joint Collector) పదవిని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అడవి భూ సర్వే(Forest land survey), హక్కుల నిర్ధారణ(Confirmation of rights), సెటిల్‌మెంట్(Settlement) పనులు వీరి పరిధిలోకి రానున్నాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు..

ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు(Collecter), రెవెన్యూ(Revenue) అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు.. అటవీ భూముల హక్కులు, అటవీ ప్రాంతాల నిర్ధారణ చేపడతారు. వీరిని 1927 చట్టం ప్రకారం నియమిస్తారు. వీళ్లు భూముల వివరాలను పరిశీలించడం, అవకతవకలు ఉన్నవాటిపై విచారణ నిర్వహించడం, అటవీ భూములకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడం వంటివి చేస్తారు. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అధికారం వీరికి ఉంటుంది.

Also Read: Prabhas: ప్రభాస్, హను రాఘవపూడి సినిమా పోస్టర్ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే?

స్థానిక సంస్థల అభివృద్ధి..

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అదనపు కలెక్టర్ పదవిలో ఉన్న అధికారులు కలెక్టర్‌కు సహాయంగా రెవెన్యూ కార్యకలాపాలు, భూముల కేటాయింపులు, పౌరసరఫరాలు, భూభారతి వంటి అంశాలన పర్యవేక్షించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళికలను పర్యవేక్షించారు. పరిశుభ్రత, పచ్చదనం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. కాగా సర్కార్ అదనపు కలెక్టర్ల పదవిని రద్దు చేయడంతో వారిని ఫారెస్ట్ సెటిల్ మెంట్ ఆఫీసర్లుగా కొనసాగించనున్నారు.

Also Read: Cyber Crime: బీ కేర్ ఫుల్.. మీరు భయపడితే మొత్తం కొల్లగొడతారు: డీసీపీ దార కవిత

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు