Ponnam Prabhakar: బీసీ వెల్ఫేర్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhaka) హెచ్చరించారు. బుధవారం ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల గురుకులాల్లో జరిగిన వరుస సంఘటనలపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని మంత్రి తెలిపారు. ఎక్కడైనా పొరపాటు జరిగి నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Ponnam Prabhakar: తెలంగాణలో రవాణాశాఖ చెక్కు పోస్టులు రద్దు చేశాం.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం
మరింత భద్రత, రక్షణకు చర్యలు తీసుకోవాలి
పాఠశాల ప్రాంగణాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని మంత్రి సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇక సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో విద్యార్థులకు మరింత భద్రత, రక్షణకు చర్యలు తీసుకోవాలని, దీనిని ప్రిన్సిపాల్స్ స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాంతీయ సమన్వయ అధికారులు పాఠశాలలు, కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, విద్యార్థుల క్రమశిక్షణపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. హెల్త్ సూపర్వైజర్లు విద్యార్థులలో దీర్ఘకాలిక వ్యాధులు గుర్తించి, వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పొన్నం సూచించారు.
ఈవీ పాలసీ, కొత్త వ్యవస్థలు
తెలంగాణలో రవాణాశాఖ చెక్ పోస్టులు రద్దు చేస్తూ జీవో 58 జారీ చేశామని, నుంచి ఇది అమలులోకి వచ్చిందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిర్భయ స్కీం కింద వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. మధ్యవర్తుల వ్యవస్థను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకుంటున్నామని, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కార్యాలయాల్లో రెగ్యులర్‌గా వచ్చే వారిని గుర్తించి హెడ్ ఆఫీస్‌కి అలర్ట్ పంపే వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు.
రవాణా శాఖలోని 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణలో ఈవీ పాలసీ తీసుకొచ్చాక రూ.577 కోట్ల టాక్స్ మినహాయించామని, దీంతో ఈవీ వాహనాల అమ్మకాలు పెరిగాయన్నారు. పొల్యూషన్ పెరగకుండా ఉండేందుకే ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. దీంతో ఈవీ వెహికిల్ అమ్మకాల షేర్ 0.03 నుంచి 1.30కి షేర్ పెరిగిందన్నారు. పొల్యూషన్ పెరగకుండదనే ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. నగరంలో 20వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతిచ్చామని, ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు రూ.10 వేలు చొప్పున, రూ.25వేలు రేటిరోఫిటింగ్ ఆటోలకు అనుమతి ఇచ్చామన్నారు.
త్వరలో సారథి..
రాష్ట్రంలో ‘వాహన్’ అమలవుతోందని, త్వరలోనే ‘సారథి’ వ్యవస్థను కూడా తీసుకొస్తామని, అలాగే ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చామని, వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చామన్నారు. రోడ్ సేఫ్టీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, రోడ్ సేఫ్టీ క్లబ్‌లను ఇంటర్, డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ 1.50 లక్షల వరకు వర్తింపజేస్తుందన్నారు. రవాణాశాఖను బలోపేతం చేస్తున్నామని, 112 మంది ఏఎంవీఏలను నియమించి వారికి శిక్షణ ఇచ్చి తీసుకున్నామన్నారు.
ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని కోరారు. టూరిజం వెహికిల్స్‌కు డబుల్ నెంబర్ ప్లేట్ ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇల్లీగల్, ఓవర్ లోడింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో1.7 కోట్ల వాహనాలు ఉన్నాయని వాటన్నిటిని రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చివరిగా, షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పొన్నం తెలిపారు.
